https://oktelugu.com/

సంచలనం: కరోనా చైనా శాస్త్రవేత్తల సృష్టినే

ఒక్క వైరస్ కరోనా.. దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. అతలాకుతలం చేస్తోంది. కోట్ల మంది ప్రాణాలు తీస్తోంది. ఎందరినో బాధితులుగా మార్చింది. కరోనా వైరస్ సహజంగా పుడితే ఎప్పుడో అంతరించిపోయేది. కానీ సృష్టించింది కాబట్టే ఇంత కల్లోలం సృష్టిస్తూ విస్తరిస్తూనే ఉంది. ఈ కరోనా వైరస్ మూలాలు ఇప్పటికీ మిస్టరీనే.. వీటిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ మరో బాంబు పేలింది. కరోనా వైరస్ చైనా శాస్త్రవేత్తల సృష్టియేనని తాజాగా బ్రిటన్, నార్వేకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : May 30, 2021 / 08:44 PM IST
    Follow us on

    ఒక్క వైరస్ కరోనా.. దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. అతలాకుతలం చేస్తోంది. కోట్ల మంది ప్రాణాలు తీస్తోంది. ఎందరినో బాధితులుగా మార్చింది. కరోనా వైరస్ సహజంగా పుడితే ఎప్పుడో అంతరించిపోయేది. కానీ సృష్టించింది కాబట్టే ఇంత కల్లోలం సృష్టిస్తూ విస్తరిస్తూనే ఉంది. ఈ కరోనా వైరస్ మూలాలు ఇప్పటికీ మిస్టరీనే.. వీటిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ మరో బాంబు పేలింది.

    కరోనా వైరస్ చైనా శాస్త్రవేత్తల సృష్టియేనని తాజాగా బ్రిటన్, నార్వేకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాకుండా అది గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు కనిపించేలా రివర్స్ ఇంజినీరింగ్ కు ప్రయత్నించినట్లు స్పష్టం చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ షాక్ అవుతున్నారు.

    కరోనా వైరస్ చైనాలోని వ్యూహాన్ వైరస్ ల్యాబోరేటరీలోనే పుట్టిందన్న అనుమానాలున్నాయి. మా దగ్గర దీనికి సరైన ఆధారాలు ఉన్నాయని బ్రిటీష్ ఫ్రొఫెసర్ అంగూస్ డాల్ గ్లిష్, నార్వేశాస్త్రవేత్త డాక్టర్ బిర్గర్ సొరెన్ సెన్ తమ నివేదికలో పేర్కొన్నారు. వీరిద్దరూ ప్రపంచంలోనే ప్రముఖ వైరాలజిస్ట్ లు. సోరెన్ సేన్ కరోనా వైరస్ ను ఎదుర్కొనే ‘బయోవాక్ 19’ రూపకల్పనలో కీలక వ్యక్తి.

    ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు కరోనా వైరస్ జన్యూక్రమాన్ని విశ్లేషించారు. అనంతరం కరోనా వైరస్ సహజసిద్ధంగా ఉద్భవించింది కాదని చెప్పే ‘ప్రత్యేకమైన వేలిముద్రలు’ గుర్తించారు. నాలుగు అమైనో అమ్లాలు సీరియల్ గా ఉండటాన్ని కనిపెట్టారు. కృత్రిమంగా తయారు చేస్తేనే ఇటువంటిది సాధ్యమవుతుందని వాళ్లు స్పష్టం చేశారు.

    కరోనా వైరస్ సహజసిద్ధంగా ఆవిర్భవించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి సహజసిద్ధంగా వ్యాపించిందని చెప్పడానికి చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నించారని ఆరోపించారు.

    కరోనా మూలాలు మానవ సృష్టియే అనే కోణంలో వెలువుడుతున్న నివేదికలతో చైనాపై ఒత్తిడి పెరుగుతున్నట్టు అంతర్జాతీయ నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.