Machilipatnam Port Tenders: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని మచిలీపట్నం పోర్టు పనులు ముందుకు సాగడం లేదు. దీంతో టెంటర్ ప్రక్రియ కూడా కదలట్లేదు. తెలుగుదేశం హయాంలో పోర్టు పనులు నిర్వహించడానికి నవయుగ కంపెనీకి పనులు అప్పగించింది. కానీ వైసీపీ సర్కారు వచ్చాక ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు. దీంతో టెండర్ వేయడం మళ్లీ వాయిదా వేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో నిబంధనలు మార్చినా టెండర్ కోసం ఎవరు రాకపోవడం గమనార్హం.

నవయుగ కంపెనీ భారీ యంత్రాలతో రూ. 436 కోట్లు పనులు చేసినా తరువాత వైసీపీ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేయడం సంచలనం సృష్టించింది. దీంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పటికి కూడా టెంటర్ వేయడానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం నిబంధనలు సడలించినా ఎవరు కూడా టెండర్ వేయడానికి ఎందుకు రావడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: రుణాలివ్వకున్నా…ఇచ్చిన రుణం వసూలుకు ఏపీ సర్కారు స్పెషల్ స్కీమ్..!
టెండర్ వేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదనే సంశయాలు వస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై నమ్మకం లేకపోవడంతోనే టెండర్ వేయడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండటం లేదని తెలుస్తోంది. కానీ మచిలీపట్నం పోర్టుకు అదానీ గ్రూపుతోనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వస్తున్న క్రమంలోనే ఎవరు కూడా టెండర్ వేయాలని చూడటం లేదని తెలుస్తోంది.
మచిలీపట్నం పోర్టుకు టెండర్ ప్రక్రియ ముందుకు కదలకపోవడం గమనార్హం. భవిష్యత్ లో కూడా టెండర్ వేసేందుకు ఎవరు రారనే విషయం తెలిసిపోతోంది. దీంతో మచిలీపట్నం రేవుకు టెండర్ సమస్య వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పోర్టుకు వైసీపీ ప్రభుత్వం ఎప్పటికి టెండర్ వేయిస్తుందో కూడా వేచి చూడాల్సిందే.
Also Read: పండుగ పూట థియేటర్లపై ఏపీ సర్కారు దాడులు.. భద్రతా ప్రమాణాలపై తనిఖీలు..