Bunny: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా వచ్చిన చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ సాధించి అల్లు అర్జున్ ఖాతాలో మరో హిట్ మూవీగా నిలిచింది.‘పుష్ప’లో బన్నీ క్యారెక్టర్ ను సుకుమార్ స్పెషల్ గా డిజైన్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ ఈ సినిమా మొత్తాన్ని ‘వన్ మ్యాన్ షో’గా ముందుకు నడిపించాడు.

నైజాం, మలయాళం, హిందీ, ఓవర్సీస్, యూఎస్ లో ‘పుష్ప’ మూవీ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లారు. ఏపీలో టికెట్లు రేట్లు తక్కువగా ఉండటంతో అక్కడ మాత్రం నష్టాలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఈ మూవీ హిట్ ఖాతాలోకి వెళ్లడంతో ‘పుష్ప-2’ను పట్టాలెక్కించేందుకు మూవీ మేకర్స్ సన్నహాలు చేసున్నారు.
‘పుష్ప’కు సంబంధించిన డిలీటేడ్ సీన్స్, వీడియో సాంగ్స్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా విడుదల చేస్తూ అల్లు ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. తాజాగా ‘పుష్ప’ టీం మరో అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీలో అల్లు అర్జున్ ఫేవరేట్ సాంగ్ ‘ఏయ్ బిడ్డా’ పాటలోని ఓ పిక్ ను షేర్ చేసింది.
ఈ పాటలో ఒక్క షాట్ కోసం ‘పుష్ప రాజ్’ 12గంటలపాటు కష్టపడ్డారని చిత్రయూనిట్ పేర్కొంది. మధ్యాహ్నం 2గంటలకు మొదలైన షూటింగ్ రాత్రి 12వరకు ఏకదాటిగా సాగిందని, ఈ సాంగ్ బన్నీ 24 డ్రెస్సులు ఒక్క సీన్ కోసం ఉపయోగించారనే విషయాన్ని వెల్లడించింది. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కు ఈ సాంగ్ ఒక నిదర్శమని పుష్ప టీం ప్రశంసలు కురిపించింది.
#PushpaBehindTheScenes 🔥🤙@alluarjun put in 12 hours of effort for just this one shot from the song #EyyBidda in #Pushpa. The shoot for this started at 2 pm and went on until 2 am. It involved 24 dress changes and multiple variations. He is truly an icon stAAr! 🤩 pic.twitter.com/NfAxpse6Bd
— Pushpa (@PushpaMovie) January 10, 2022