ఏపీలో గ్రీన్ జోన్ లలో ఆంక్షల సడలింపు లేదా?

కేంద్రం ప్రకటించిన రెండవ విడత లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగనున్న నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవ్వని ప్రాంతాల్లో, కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చే విషయంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 671 మండలాలకు 97 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. దాదాపు నెల రోజుల అనంతరం గ్రీన్ జోన్ లో పరిశ్రమలకు, వ్యవసాయ అనుబంధ రంగ సంస్థలకు నిర్వహణకు అనుమతి అనుమతి […]

Written By: Neelambaram, Updated On : April 21, 2020 3:59 pm
Follow us on

కేంద్రం ప్రకటించిన రెండవ విడత లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగనున్న నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవ్వని ప్రాంతాల్లో, కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చే విషయంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 671 మండలాలకు 97 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. దాదాపు నెల రోజుల అనంతరం గ్రీన్ జోన్ లో పరిశ్రమలకు, వ్యవసాయ అనుబంధ రంగ సంస్థలకు నిర్వహణకు అనుమతి అనుమతి ఇచ్చారు.

అయితే ఆ ప్రభావం తొలిరోజు పెద్దగా కనిపించలేదు. పంట పొలాల్లో కూలీ పనులు చేసే వారు తప్ప మిగిన సంస్థలు పనులు పెద్దగా ప్రారంభంకాలేదు. దీనికి కారణం ప్రజలు కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందనే ఆందోళనతో పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కొద్ది రోజులు సమయం పడుతుందని అధికారి ఒకరు చెప్పారు. రైస్, పప్పుల మిల్లులు కొన్ని అక్కడక్కడా పనులు ప్రారంభించాయి. అదేవిధంగా డ్వాక్రా సంఘాలు, ప్రవేటు సంస్థలు కొన్ని బాడీ సూట్లు, మాస్కులు తయారు చేస్తున్నాయి. ఏవి కొద్దీ రోజుల కిందట ప్రభుత్వ అనుమతితో పనులు ప్రారంభించాయి.

ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు, పిండిమరలు, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు. ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలు, సబ్బుల తయారీ కంపెనీలు, శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్‌ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్‌ కంపెనీలు పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. కొన్ని నిబంధనలు తప్పని సరిగా ఏవి పాటించాలి. ప్రతి మండలంలో స్థానిక తహశీల్దార్ ప్రత్యేక అధికారిగా ఉంటూ ఆయా సంస్థలు నిబంధనలు పాటిస్తుంది లేనిది పరిశీలిస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్ లు గ్రీన్ జోన్ లో పాటించాల్సిన నిబంధనలు రూపొందించి తహశీల్దార్ కార్యాలయాలకు పంపారు.

మరోవైపు రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయంలో పనిచేసున్న ఆర్ధిక శాఖ అధికారులు విధులకు హాజరు కావాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఆదేశించారు. ప్రభుత్వ వాహన సదుపాయం కలిగిన అధికారులు అందరూ కార్యలయాలకు రావాలని కోరారు. సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు వీలుగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి పట్టణాలకు ప్రతికంగా బస్సులు నడిపారు. విధులకు హాజరు కాని ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేసి ఆన్ లైన్ లో ఫైళ్లను క్లియర్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.