Y S Sharmila Hiking: తెలంగాణలో షర్మిల పరిస్థితి చూస్తుంటే మాత్రం దారుణంగా తయారైంది. ఆమెను దివంగత మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె, సీఎం జగన్ చెల్లెలు అంటే ఏపీలో ఎంత ప్రాముఖ్యత ఉండేదో అందరికీ విదితమే. కానీ తెలంగాణలో మాత్రం ఆమెను పట్టించుకునే నాథుడే లేడు. ఆమె నిరసనలు చేసినప్పుడు గానీ, తొలివిడత పాదయాత్రలో గానీ ఆమెపై ఎలాంటి ప్రచారాలు లేవు.
పోనీ ఇప్పుడు మళ్లీ పాదయాత్ర చేస్తోందని కూడా పెద్దగా ఎవరికీ తెలియట్లేదు. ఆమె అసలు పాదయాత్ర చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో నామమాత్రంగా అయినా వినిపించట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆమె ఆగిపోయిన చోట నుంచే తన పాదయాత్రను ప్రారంభించారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని కొండపాక ఊర్లో నుంచి పాదయాత్రను స్టార్ట్ చేసింది షర్మిల.
అయితే ఈ పాదయాత్రకు ఎలాంటి ప్రచారం దక్కట్లేదు. ప్రజల్లో కనీసం ఆమె గురించి చర్చ జరగట్లేదు. ఇంకా చెప్పాలంటే ఆమె ఏ ఊర్ల మీద నుంచి అయితే పాదయాత్ర చేస్తుందో.. ఆ ఊర్లలో కూడా ఎలాంటి రెస్పాన్స్ కనిపించట్లేదు. రాజకీయ పార్టీలకు ముఖ్యంగా ప్రచారం కల్పించే మీడియాలో కూడా ఆమె పేరు వినిపించట్లేదు.
Also Read: Bandi Sanjay Tweet On KCR Health: సీఎం కేసీఆర్ ఆస్పత్రి పాలవడంపై బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
విచిత్రం ఏంటంటే ఆమె అనుకూల మీడియాలో కూడా తన పాదయాత్ర పెద్దగా ప్రచారానికి నోచుకోవట్లేదు. ఖర్చు భారీగానే ఉన్నా.. అటు సోషల్ మీడియాలో కూడా ఏ మాత్రం ప్రభావం కనిపించట్లేదు. గతేడాది అక్టోబర్ లో చేవెళ్లలో ఆమె పాదయాత్ర ప్రారంభించినప్పుడు కొంత ప్రచారం అయితే కనిపించింది.
కానీ మధ్యలో కరోనా, ఎమ్మెల్సీ ఎన్నికల ఆంక్షల వల్ల ఆమె పాదయాత్రను ఆపేశారు. కానీ ఇప్పుడు రెండోసారి ప్రారంభిస్తే మాత్రం మునుపటిలాగే ప్రచారం అయితే కనిపించట్లేదు. పైగా ఆమె ఏపీ రాజకీయాల్లోకి వెళ్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో అంతో ఇంతో పట్టించుకునే వారు కూడా పూర్తిగా ఆమెను పక్కన పెట్టేస్తున్నారు. ఇలా షర్మిల పాదయాత్ర నామమాత్రం అయిపోయింది.
Also Read: Janasena Party: జనసేనలోకి జన వరద.. ఆవిర్భావ సభ ముందు ఊపు..
Recommended Video: