https://oktelugu.com/

Nara Lokesh Satires On AP Budget 2022: అమ్మఒడి.. నాన్న బుడ్డి, ఏపీ బడ్జెట్ పై నారా లోకేష్ సెటైర్లు వైరల్

Nara Lokesh Satires On AP Budget 2022: ఏదైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పడం మన చినబాబుకు పెద్దగా రాదు.. ఎందుకంటే ఆయనదంతా ఇంగ్లీష్ చదువులు.. తేటతెలుగులో పలకలేక చాలా సార్లు తడబడ్డాడు. ఇందుకోసం నాన్న చంద్రబాబు ఒక తెలుగు మాస్టర్ ను పెట్టించి మరీ ట్యూషన్ లో నారాలోకేష్ కు తెలుగు నేర్పించారని టాక్. ఎలాగోలా కష్టపడి తేటతెలుగులో మాట్లాడడం నేర్చుకున్న లోకేష్ బాబు ఇప్పుడు ప్రసంగాల్లో ప్రాసలో అదరగొట్టేస్తున్నాడు. తాజాగా ఏపీ బడ్జెట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2022 / 11:11 AM IST
    Follow us on

    Nara Lokesh Satires On AP Budget 2022: ఏదైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పడం మన చినబాబుకు పెద్దగా రాదు.. ఎందుకంటే ఆయనదంతా ఇంగ్లీష్ చదువులు.. తేటతెలుగులో పలకలేక చాలా సార్లు తడబడ్డాడు. ఇందుకోసం నాన్న చంద్రబాబు ఒక తెలుగు మాస్టర్ ను పెట్టించి మరీ ట్యూషన్ లో నారాలోకేష్ కు తెలుగు నేర్పించారని టాక్. ఎలాగోలా కష్టపడి తేటతెలుగులో మాట్లాడడం నేర్చుకున్న లోకేష్ బాబు ఇప్పుడు ప్రసంగాల్లో ప్రాసలో అదరగొట్టేస్తున్నాడు. తాజాగా ఏపీ బడ్జెట్ పై ఆయన వేసిన సెటైర్లు బాగా పేలాయి.

    Lokesh, Jagan

    తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో బడ్జెన్ ను ప్రవేశ పెట్టారు. దీనిపై వైసీపీ నేతలు ఆహోఓహో అంటూ ప్రశంసలు కురిపించారు. తమది సంక్షేమ బడ్జెట్ అని జబ్బలు చరుచుకున్నారు. బడ్జెట్ లో పేదరిక నిర్మూలనలో ఏపీలో ఐదో స్థానంలో ఉందని గొప్పలకు పోయారు. విద్యా, వైద్య రంగాలకే తమ మొదటి ప్రాధాన్యం అన్నారు.

    Also Read: Pawan Kalyan Janasena: జనసేన ఇక జనంలోకి..

    సహజంగానే విపక్షాలు దీనిపై కౌంటర్ అటాక్ కు దిగాయి.ఈ బడ్జెట్ మసిపూసి మారేడు కాయలా ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా ఏపీ బడ్జెట్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైరికల్ గా స్పందించాడు. ఆయన మాటలు వైరల్ అయ్యాయి.

    ఈ బడ్జెట్ లో బీసీల ఊసేదని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నించారు. ‘అమ్మ ఒడి అబద్దం.. నాన్న బుడ్డి’ నిజమని సెటైర్ వేశారు. అమ్మఒడితో డబ్బులు పంచి.. నాన్న బుడ్డితో వైన్ షాపుల వద్ద అవే డబ్బులను మగవాళ్లతో కొనిపిస్తూ వైసీపీ సర్కార్ దోచుకుంటోందని నారా లోకేష్ వేసిన సెటైర్ బాగా పేలింది. వైసీపీ కోటరి బాగుపడాలన్న రీతిలోనే రాష్ట్ర బడ్జెట్ ఉందని ఆరోపించారు.

    Also Read: New Record For Yogi Adityanath: యూపీలో యోగి సాధించిన రికార్డులు ఏంటి?

    జగన్ మోహన్ రెడ్డి కాదు.. జగన్ మోసపు రెడ్డి అంటూ నారా లోకేష్ ప్రాసలతో కూడా వైసీపీపై విరుచుకుపడడం విశేషం. బడ్జెట్ లెక్కలకు.. వాస్తవానికి పొంతన లేదని లెక్కలతోనూ లోకేష్ బాబు కొట్టాడు. లోకేష్ లోని ఈ పరిణతి చూసి టీడీపీ నాయకులకు కడుపు ఉబ్బి పోయింది. చిన్న బాబు ఇప్పటికైనా దారిలోకి వచ్చి పంచులు పేల్చడంపై వారంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.