Chandrababu: గురివింద గింజ సామెత మాదిరిగా ఉంటుంది చంద్రబాబు వ్యవహార శైలి. నాకంటే మించిన పాలకుడు ఉండడు.. నేనొక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు.. నాపై ఒక్క కేసు కూడా నిలబడలేదు అని చెబుతారు. కోర్టులకు వెళ్లి ఎంచక్కా స్టేలు మాత్రం తెచ్చుకుంటారు. దానినే నిజాయితీగా చూపుతారు. ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేకపోయారని చెబుతుంటారు. కానీ కోర్టుకు స్వేచ్ఛగా వెళ్లి విచారణ మాత్రం జరిపించుకోరు. చంద్రబాబుది అదో స్టైల్.
గతంలో ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను డబ్బులు ఇవ్వలేదని.. చేసిందంతా రేవంత్ రెడ్డి అని చెప్పలేకపోయారు. కానీ నాటి కెసిఆర్ సర్కార్ కు.. నా వద్ద ఏసీబీ ఉందని.. నా వద్ద పోలీసులు సైతం ఉన్నారని సవాల్ చేశారు. నన్ను అరెస్టు చేస్తే ఫోన్ టాపింగ్ కేసు బయటికి తీస్తానని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. కానీ నేను ఏ తప్పు చేయలేదని.. అసలు నాకు ఆ కేసుతో సంబంధం లేదని తేల్చి చెప్పడానికి మాత్రం సాహసించలేకపోయారు.
ఆది నుంచి చంద్రబాబు పరిస్థితి ఇంతే. తనకు తాను చట్టాలకు అతీతుడు అన్నది ఆయన భావన. చట్టాలు చేసింది తనకు కాదని.. ప్రజల కోసమేనని ఆయన విశ్వసిస్తుంటారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు నేరుగా దానికి సమాధానం చెప్పరు. అందులో ఉన్న లూప్ హోల్స్ ను వెతుకుతారు. దానిని పట్టుకుని బయటపడే ప్రయత్నం చేస్తారు. కేసులు నమోదైన ప్రతిసారి చంద్రబాబు పై ఒక అపవాదు వచ్చి పడుతుంది.. వ్యవస్థలను మేనేజ్ చేసి.. బయటపడుతుంటారని ప్రత్యర్థులు, తటస్తులు అభిప్రాయపడుతుంటారు. కానీ ప్రోటీడీపీ మీడియా, ప్రో టిడిపి ఫ్యాన్స్ మాత్రం అది చంద్రబాబు చతురతగా పేర్కొంటారు. అది ఎదుటి వారు చేస్తే వ్యభిచారం.. చంద్రబాబు చేస్తే మాత్రం లోక కళ్యాణమన్నట్టు వారి భావన. ఇప్పుడు ఐటి ఇచ్చిన ముడుపుల నోటీసులు వ్యవహారంలో సైతం ఇదే తరహా ప్రచారం చేసుకుంటున్నారు.