No income for horse owners in Pahalgam : అలాంటి ప్రాంతం ఉగ్రవాదుల దుశ్చర్య వల్ల నాశనమైపోయింది. పచ్చని పచ్చిక బయళ్ల మీద నెత్తురు పారింది. ఒకరకంగా పహల్గాం కాస్త రుధిర క్షేత్రమయింది. లెక్కకు మిక్కిలి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సరదాగా కుటుంబ సభ్యులతో అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన వారంతా ఉగ్రవాదుల తూటాలకు బలైపోయారు. అయిన వాళ్ళు చూస్తుండగానే నేల కోరి గారు. చనిపోయిన వారు ఎటువంటి తప్పు చేయలేదు. ఎదుటి వాళ్లను దోచుకోలేదు. కనీసం ఉగ్రవాదులతో వాగ్వాదానికి కూడా దిగలేదు. అలాంటి అమాయకులను ఉగ్రవాదులు అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. సాటి మనుషులు అని చూడకుండా దారుణంగా చంపేశారు. అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన పాపానికి వారిని అత్యంత పాశవికంగా చంపేశారు. ఈ ఘటన తర్వాత పహల్గాం రూపు ఒక్కసారిగా మారిపోయింది. పర్యాటకుల సందడి తగ్గిపోయింది. వచ్చేవారి సంఖ్య పడిపోయింది. స్థూలంగా చెప్పాలంటే పహల్గాం ప్రాంతంలో ఒక రకమైన నిశ్శబ్దం కొనసాగుతోంది. స్థానికులు రేపు ఏం జరుగుతుందోనని భయంతో బతుకుతున్నారు. ఉగ్రవాదులు ఎక్కడి నుంచైనా వస్తారేమోనని ఆందోళనతో కాలం గడుపుతున్నారు.
ఉపాధి లేకుండా పోయింది
ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత పహల్గాం ప్రాంతానికి పర్యాటకులు రావడం పూర్తిగా తగ్గిపోయింది. పర్యాటకులు రాకపోవడంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. పర్యాటకుల మీద ఆధారపడి బతికే స్థానికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు.. ముఖ్యంగా పోనీవాలాలు(పర్యటకులతో గుర్రపు స్వారీ చేయించేవారు) ఉపాధి లేక.. ఆదాయం వచ్చే మార్గం లేక నరకం చూస్తున్నారు.. పహల్గాం ప్రాంతంలో మొత్తం 6 గుర్రాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ గుర్రాలన్నిటికీ విపరీతమైన గిరాకీ ఉండేది. ఒక్క పోనీ వాలా రోజుకు 3000 వరకు సంపాదించేవారు. కానీ ఇప్పుడు రోజు వెయ్యి రూపాయలు వస్తే గొప్ప.. 6000 గుర్రాలు ఉంటే.. ఇందులో 100 అశ్వాలకు మాత్రమే గిరాకీ ఉంది. దీంతో చాలామంది పోనీవాలాలు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏం చేయాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వారికి ఇది తప్ప మరొక పని తెలియదు. పోనీ వేరే ఏదైనా పని చేద్దామంటే.. ఇప్పుడు కాశ్మీర్లో అంతగా అనుకూల పరిస్థితులు లేవు.
ఒక్కో గుర్రాన్ని..
పోనీవాలాలు ఒక్కో గుర్రాన్ని లక్ష పెట్టి కొనుగోలు చేశారు.. సీజన్లో ప్రతిరోజు ఒక్క గుర్రానికి ఆహారం కోసం 400 వెచ్చించేవారు. ఇప్పుడు ఉపాధి లేకపోవడంతో ప్రతిరోజు రెండు కోట్ల వరకు నష్టం వస్తుందని పోనీవాలా యూనియన్ సభ్యులు చెబుతున్నారు. సీజన్లో 3,000 వరకు ప్రతిరోజు ఆదాయం లభించగా.. ఇప్పుడు కేవలం 1000వరకే లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఉపాధి లభించకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటున్నారు..” ఒకప్పుడు పర్యాటకులు విపరీతంగా వచ్చేవారు. ఇక్కడ ఉన్న ఆరువేల గుర్రాలకు రోజు పని లభించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఉగ్ర దాడి తర్వాత మా బతుకులు మొత్తం సర్వనాశనమయ్యాయని” పోనీ వాలాలు చెబుతున్నారు.