కరోనాకు అంతం లేదట.. టీకాలు వేసినా వేవ్ లు తప్పవు?

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగలేదు. వైరస్ తో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాణాలే అరచేతిలో పెట్టుకుని మరీ బతుకీడ్చాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ముప్పు ఇంతటితో ఆగుతుందనుకుంటే పొరపాటే. అది జీవితకాలం కూడా మనతోనే ఉంటుందని చెబుతన్నారు శాస్ర్తవేత్తలు. కరోనా కొత్తరకాలు పుట్టుకు వస్తుండడంతో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు మరింత కాలం పట్టే అవకాశం కనిపిస్తోంది. వైరస్ ఎప్పటికి మనతోనే ఉంటుందని, రానున్న రోజుల్లో దాని తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు […]

Written By: Sekhar Katiki, Updated On : June 23, 2021 10:14 am
Follow us on

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగలేదు. వైరస్ తో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాణాలే అరచేతిలో పెట్టుకుని మరీ బతుకీడ్చాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ముప్పు ఇంతటితో ఆగుతుందనుకుంటే పొరపాటే. అది జీవితకాలం కూడా మనతోనే ఉంటుందని చెబుతన్నారు శాస్ర్తవేత్తలు. కరోనా కొత్తరకాలు పుట్టుకు వస్తుండడంతో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు మరింత కాలం పట్టే అవకాశం కనిపిస్తోంది. వైరస్ ఎప్పటికి మనతోనే ఉంటుందని, రానున్న రోజుల్లో దాని తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కరోనా పూర్తి నిర్మూలన సాధ్యం కాదనే విషయం తెలిసిందే. ఇప్పటికి మశూచిని మాత్రమే పూర్తిగా పారదోలామని గుర్తుంచుకోవాలి. కరోనా వైరస్ కు కారణమైన సార్స్ కోవ్-2ను మాత్రం పూర్తిగా నిర్మూలించేందుకు సాధ్యం కాదు. కఠిన లాక్ డౌన్ తో న్యూజీలాండ్ లాంటి దేశాలు సున్నాకు తీసుకువచ్చినా ఇది అన్ని దేశాలకు సాధ్యం కాదని తెలుస్తోంది. పేద, మధ్య ఆదాయ దేశాలకు ఇది సవాలుగా మారుతుంది.

కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ రూపాంతరం చెందుతోంది. కరోనా కొత్త వేరియంట్లపై ఆందోళన నెలకొంది. బ్రిటన్, అమెరికా, దక్షిణ అమెరికా, భారత్ దేశాల్లో కొత్త వేరియంట్లు వెలుగు చూడడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొవిడ్-19ను పూర్తిగా నిర్మూలించకపోతే పరిస్థితి ఏంటనేది పలువురి వాదన. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు శాస్ర్తవేత్తలు సైతం పలు మార్గాలను వెతుకున్నా దానికి ఇంకా సరైన సమాధానం దొరకడం లేదు.

వ్యాక్సిన్ తీసుకుంటే వ్యాధి సోకిన వారికి కొంత కాలం రక్షణ ఉంటుంది. రెండోసారి వైరస్ సోకిన వారిలో కూడా యాంటీ బాడీలు సమృద్ధిగానే ఉంటున్నాయి. కేవలం రోగ నిరోధకత తక్కువగా ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోని వారే వైరస్ వల్ల ముప్పుకు గురవుతున్నారు. కరోనాపై హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేంత వరకు ఎండమిక్ స్థాయి వచ్చే వరకు ఇలాంటి ప్రమాదం తప్పదు. ఆ తర్వాత కాలం గడిచేకొద్దీ కరోనా కూడా సాధారణ జలుబులాగే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.