కనికరం లేని మోడీజీ.. ఇలా చేస్తావా?

‘హైదరాబాద్‌కు చెందిన కరణ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. ఇతనికి నెలకు 50 వేల జీతం. జీతం బాగానే ఉండడం.. కంపెనీ పెద్దదే కావడంతో డేర్‌‌ చేసి రూ.50 లక్షలతో ఇల్లు కొన్నాడు. నెలనెలా రూ.25 వేల వరకు ఈఎంఐ పెట్టుకున్నాడు. కానీ.. ఈ కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అతని ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి మారటోరియం అమల్లో ఉండడంతో పెద్దగా టెన్షన్‌ పడలేదు. ఈనెలతో మారటోరియం ముగియడంతో వచ్చే నెల నుంచి ఈఎంఐ ఎలా కట్టేది […]

Written By: NARESH, Updated On : September 1, 2020 9:45 am
Follow us on


‘హైదరాబాద్‌కు చెందిన కరణ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. ఇతనికి నెలకు 50 వేల జీతం. జీతం బాగానే ఉండడం.. కంపెనీ పెద్దదే కావడంతో డేర్‌‌ చేసి రూ.50 లక్షలతో ఇల్లు కొన్నాడు. నెలనెలా రూ.25 వేల వరకు ఈఎంఐ పెట్టుకున్నాడు. కానీ.. ఈ కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అతని ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి మారటోరియం అమల్లో ఉండడంతో పెద్దగా టెన్షన్‌ పడలేదు. ఈనెలతో మారటోరియం ముగియడంతో వచ్చే నెల నుంచి ఈఎంఐ ఎలా కట్టేది అని బాధపడుతున్నాడు.’

Also Read: మోడీకి నెటిజన్ల సెగ.. బాగానే తగిలింది

‘హైదరాబాద్‌కు చెందిన ప్రదీప్‌ కోటి రూపాయలతో ఐదంస్తుల బిల్డింగ్‌ కట్టాడు. ఇందుకు సగానికి పైగా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. ఐదంస్తుల్లో ఒక్కో పోర్షన్‌లో రెండు ఫ్యామిలీల చొప్పున 10 ఫ్యామిలీస్‌ రెంట్‌కు దిగాయి. కరోనా ముందు వరకు అంతా సాఫీగానే సాగింది. నెలనెలా రెంటర్స్‌ పే చేసిన రెంట్‌తో ఈఎంఐ చెల్లిస్తూ వచ్చాడు. కానీ.. ఎప్పుడైతే కరోనా హైదరాబాద్‌లో అడుగుపెట్టిందో అప్పటినుంచి ప్రజల్లో భయం పెరిగి పోయి ఇల్లు ఖాళీ చేసి తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన బిల్డింగ్‌లో వారి ఫ్యామిలీ తప్ప ఎవరూ లేరు. దీంతో ఈనెల నుంచి ఈఎంఐ ఎలా చెల్లించలో తెలియక సతమతం అవుతున్నాడు.’

కరోనా కారణంగా ఫైనాన్షియల్‌ ప్రాబ్లం రాకుండా పరిస్థితుల నుంచి కొంత రిలీఫ్ ఇస్తూ గత మార్చిలో ఆర్‌‌బీఐ ఓ ప్రకటన చేసింది. కరోనా కారణంగా అటు ఉద్యోగాలు ఊడిపోవడం.. ఇటు శాలరీస్‌లలో కోతలు పడుతుండడంతో మూడు నెలల పాటు ఈఎంఐలకు మారటోరియం ఇచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వారు మూడు నెలలపాటు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు.

కరోనాతో పేదలు ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం మార్చి 26న రూ.70వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయామని, లోన్ల పేమెంట్లలో మినహాయింపు‌ ఇవ్వాలంటూ పెద్ద సంఖ్యలో రెక్వెస్ట్‌లు రావడంతో పరిగణలోకి తీసుకున్న కేంద్రం మారటోరియం దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కమర్షియల్‌ బ్యాంక్‌, ఫైనాన్స్‌ బ్యాంకులు, కో ఆపరేటివ్‌ బ్యాంకులు, ఆలిండియా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఈ మారటోరియానికి అనుకూలంగా ఓటేశాయి. ఆ తర్వాత మేలో మరో మూడు నెలల పాటు మారటోరియం పొడగిస్తూ ఆర్‌‌బీఐ ప్రకటించింది.

Also Read: కరోనాకు.. మగవాళ్లకు ఉన్న లింకేటీ?

ఈ మారటోరియం కాస్త ఈ ఆగస్టు 31తో ముగిసింది. ఈ నెల సెప్టెంబర్‌‌ 1 నుంచి లోన్లు పే చేయాల్సిందే. దీంతో ఇప్పుడు ఈఎంఐలున్న ప్రతిఒక్కరిలోనూ టెన్షన్‌ పట్టుకుంది. చాలా మంది ఎంప్లాయిస్‌ తమ జాబ్‌ను ఆధారంగా చేసుకొని ఏదో ఒక వస్తువో లేక ఇల్లో, కారో.. కొన్నారు. కరోనాను సాకుగా చూపి చాలా కంపెనీలో ఎంప్లాయిస్‌ని తగ్గించడం.. లేక ఎంప్లాయిస్‌ జీతాల్లో కోత పెడుతుండడంతో ఇప్పుడు ఈఎంఐల పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉందని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇంకా ఇప్పటివరకు ఉద్యోగాలు దొరకలేదు. ఈ ఆరు నెలలు జీతాలు లేక పోయినా ఈఎంఐల బాధ లేకుండే.

నెలనెలా అడ్జస్ట్‌మెంట్లు.. ఫ్యామిలీ మెయింటనెన్స్‌.. అటు ఈఎంఐ. లోన్‌ చెల్లించకుంటే చెక్స్‌ బౌన్స్‌ అవుతాయి. మరోవైపు క్రెడిట్‌ స్కోర్‌‌ పడిపోతూ ఉంటుంది. వీటన్నింటికి తోడు బ్యాంకుల నుంచి నోటీసులు. అటు ఉద్యోగాలు లేక.. ఇటు ఆదాయం ఈ ఈఎంఐలు ఇప్పుడు గుదిబండలా మారాయి. అన్నీ దేశాల్లో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నారు. కానీ మన కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం ప్రజల జేబుల్లోంచి ఈ కరోనా టైంలోనూ ముక్కుపిండి వసూలు చేయడానికి రెడీ అవుతోంది. దీనిపై అందరూ నెత్తినోరు బాదుకుంటున్నారు.