No Confidence Move: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీపై దేశంలోని పలు విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించాయి. దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చాయి. ప్రజాస్వామ్యం అన్నాకా ఎటువంటి విషయాలు సాధారణమైనప్పటికీ.. బుధవారం ప్రకటించిన అవిశ్వాస తీర్మానమే అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 2019లో మోడీ చెప్పిన జోస్యమే నిజమైందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐదు సంవత్సరాల క్రితం మోడీ చేసిన వ్యాఖ్యల వీడియోను భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో మరొకసారి పోస్ట్ చేసింది. ఆ వీడియో తెగ వైరల్ అవుతున్నది.
నాడు ఏం జరిగిందంటే
2019 ఫిబ్రవరి 7వ తేదీన పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. విపక్ష పార్టీలు 2023 లోనూ అవిశ్వాస తీర్మానాన్ని సిద్ధం చేసుకోవచ్చని అన్నారు. ఏడాది క్రితమే విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించిన విషయాన్ని నాడు మోడీ మాట్లాడుకుంటూ ప్రస్తావించారు. ” ప్రతిపక్షాలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఇలాంటి ఉత్సాహమే నేను కోరుకునేది. 2023 లోనూ మీకు ఇలాంటి అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చే అవకాశం కలుగుతుంది. మీకు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను” అని మోడీ వ్యాఖ్యానించారు. దీంతో అధికార పార్టీ సభ్యులు నవ్వులు చిందించారు. గట్టిగా బల్లులు చరిచారు. ” సమర్పణ, సేవా భావం తో ఇద్దరు ఎంపీల నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. అహంకార భావంతో 400 మంది ఎంపీలు ఉన్నవారు 40 మంది సభ్యులకు పడిపోయారు” అంటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి చురుకలు అంటించారు. వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి మోడీ, విపక్ష పార్టీ నాయకురాలు సోనియా గాంధీ సభలోనే ఉన్నారు
చంద్రబాబు సారధ్యంలో..
ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని, ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై 2018లో నారా చంద్రబాబునాయుడు సారథంలోని తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. పలు విపక్ష పార్టీలు ఈ తీర్మానాన్ని బలపరిచాయి. అయితే భారతీయ జనతా పార్టీ బలం ముందు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. నాడు ఈ అవిశ్వాస తీర్మానానికి పచ్చ మీడియా ఎక్కడా లేని ప్రయారిటీ ఇచ్చింది. కాకపోతే ఈ అవిశ్వాస తీర్మానం ముందుగానే ఈ పార్లమెంట్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయింది. ఇక 2024 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నాడు 2019లో మోడీ 2024లో ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై జోస్యం చెప్పారని భారతీయ జనతా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.