
మాజీ గవర్నర్, పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్ ఎల్. భాటియా (100) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తీవ్ర అసౌకర్యానికి గురికావడంతో కుటుంబీకులు అమృత్ సర్ లోని ఫోర్టిస్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం భాటియా తుది శ్వాస విడిచారు. అమృత్‌సర్ పార్లమెంట్ స్థానం నుంచి 1972నుంచి ఆమర ఆరుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 2008 వరకు కేరళ గవర్నర్ గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.