Nithin Gagkari: బీజేపీలో నేతల మధ్య అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఒక్కొక్కరుగా తమ నోటికి పని చెబుతున్నారు. తమలో కలిగే ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. గతంలో శతృఘ్నసిన్హా, యశ్వంత్ సిన్హా వంటి వారు ఎదురుతిరిగి పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నితిన్ గడ్కరీ వంతయింది. ఆయన మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు మొత్తం ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించినవే కావడం విశేషం. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.
ఆయన తన మాటలుగా కాకుండా కొందరంటూ తన ప్రసంగం మొదలు పెట్టారు. కొందరికి సరైన మంత్రిత్వ శాఖలు రాలేదనే కోపం ఉందంటూ పరోక్షంగా విమర్శించారు. ఇంకొందరికి మంత్ర పదవి దక్కలేదనే అక్కసు ఉందని తెలుస్తోందని తన మనసులోని మాట బయటపెట్టారు. సీనియర్ నాయకుల్లో సైతం ఎంతో నైరాశ్యం ఉందని తెలియజేసేందుకు తాపత్రయపడ్డారు. దీంతో ప్రధాని మోడీ విధానాలను పరోక్షంగా ఎండగడుతున్నారనే విషయం తెలిసిపోతోంది.
ఇక ముఖ్యమంత్రుల విషయంలో కూడా పార్టీ అవలంభించే విధానాలతో నాయకుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇంతవరకు ఆరుగురు ముఖ్యమంత్రులను మార్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి భయం పట్టుకుంటోంది. ఎవరిని ఎప్పుడు ఎలా మార్చుతారో తెలియని సందర్భంలో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎంలను మార్చుతున్న విధానంపై కూడా గడ్కరీ తన ఆవేదన వెలిబుచ్చారు.
ఈ నేపథ్యంలో బీజేపీ మూటగట్టుకుంటున్న అప్రదిష్టను తెలియజెప్పేందకు గడ్కరీ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో అని అందరిలో సంశయం నెలకొంది. దీంతో నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన ఎందుకు ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంలో ఆంతర్యమేమిటని మీమాంసలో పడిపోయారు. ఏదిఏమైనా బీజేపీలో ఇంకా ఏ మార్పులు చోటుచేసుకుంటాయో అని అందరిలో సందేహాలు వస్తున్నాయి.