Union Budget 2023: ఏప్రిల్ లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మారనుండటం, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని అడుగులు వేయటం… పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేయటం… వ్యవసాయం, పరిశ్రమలకు చేయూతనివ్వటం… ఇన్ని సవాళ్ళ మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.. 2014 నుంచి 2022 వరకు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థికపద్ధుల్లో ఎన్నడూ కూడా ఇటువంటి ఒత్తిడి ఎదుర్కోలేదు.. కానీ ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ పై ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి.. మరోవైపు వచ్చే ఏడాదిలో పార్లమెంటు ఎన్నికలు ఉండటం, ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వరాలు కురిపిస్తుందోనని సగటు భారతీయుడు ఎదురు చూస్తున్నాడు.

ఆదాయపు పన్ను పరిమితుల్లో సగటు వేతన జీవికి కేంద్రంలోని మోదీ సర్కార్ ఊరట ఇస్తుందనే అంచనాలు ఈసారి భారీగా ఉన్నాయి.. మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి సీతారామన్ ఇటీవల చెప్పిన తర్వాత ఆశలు పెరిగాయి.. వచ్చే లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర నుంచి ఐదు లక్షల వరకు పెంచుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
లోక్ సభ ఎన్నికలు ఏడాది మాత్రమే ఉన్న తరుణంలో ఈసారి సంక్షేమానికి బడ్జెట్ లో కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందనే అంచనాలు భారీగా ఉన్నాయి.. ఇందులో భాగంగా కొన్ని సంవత్సరాలుగా వేతన జీవులు ఎదురుచూస్తున్న ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లను తగ్గించి కొత్త పన్ను స్లాబులను అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.. దీనిపై ప్రధాని కార్యాలయం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నాయి.. ప్రస్తుతం ఉన్న పాత పన్ను విధానానికి 2021 లో కొత్త పన్ను వ్యవస్థను తీసుకువచ్చారు.. పాత పన్ను విధానంలో మూడు స్లాబ్ లే ఉండగా, కొత్త పన్ను విధానంలో ఆరు స్లాబ్ లను వచ్చారు.. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం పైన ఐదు శాతం, ఐదు నుంచి 7.5 లక్షల వరకు 10 శాతం, 7.5 లక్షల నుంచి పది లక్షల వరకు 15 శాతం, పది లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం, 12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం, 15 లక్షలు ఆ పైన ఆదాయం కలిగిన వారికి 30% పన్ను వర్తిస్తుంది. ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే దానిపై పన్ను చెల్లింపుదారులకు స్వేచ్ఛ ఉంది. అయితే కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపులను చూపించేందుకు అవకాశం లేదు.. ఈసారి బడ్జెట్లో మధ్యతరగతికి పెద్దపీట వేయాలని భావిస్తున్న మోడీ ప్రభుత్వం… ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో ఊరట ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుందని సమాచారం.. ప్రస్తుతం 15 లక్షలు, ఆపై ఉన్న మొత్తానికి 30% పన్ను వర్తిస్తున్నది. ఈ మొత్తాన్నీ పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఐదు లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. నూతన బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.. ప్రస్తుతం 2.5 లక్షలు గా ఉన్న పరిమితిని ఐదు లక్షల పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ నిర్ణయం వల్ల వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 2.5 లక్షల వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్నూ లేదు.. 2.5 లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం కలిగిన వారికి ఐదు శాతం పన్ను వర్తిస్తున్నది. 60 నుంచి 80 ఏళ్ల వయసు ఉన్న వారికి ఈ పన్ను పరిమితి మూడు లక్షలు గా ఉంది.. 80 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల వరకు పండు మినహాయింపు లభిస్తున్నది. 60 ఏళ్లలోపు ఉన్నవారికి ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.. దీనిపై గత కొన్ని బడ్జెట్లలో నిరాశే ఎదురైంది.. 2024లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆ పరిమితిని పెంచుతారని చెల్లింపుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఇక ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని ఆర్థిక వర్గాలు అంటున్నాయి.. మరోవైపు ఆర్థిక మాంద్యం ముసురుకుంటున్న వేళ తయారీ రంగానికి మరిన్ని జవసత్వాలను కేంద్రం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది..