ఆ నలుగురి కథ ముగిసింది

2012 నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఈ ఉదయం 5.30గంటలకు ఉరితీశారు. అర్ధరాత్రి విచారణ తరువాత, మరణశిక్షను సమీక్షించాలని కోరుతూ దోషుల్లో ఒకరు దాఖలు చేసిన చివరి నిమిషంలో చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ అనే నలుగురిని తెల్లవారుజామున 5:30 గంటలకు ఢిల్లీ తీహార్ జైలులో ఉరితీశారు. ఉరి తీసిన తర్వాత వారి మృతదేహాలను అంబులెన్సులలో దీన్ దయాల్ ఉపాధ్యాయ […]

Written By: Neelambaram, Updated On : March 20, 2020 9:54 am
Follow us on

2012 నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఈ ఉదయం 5.30గంటలకు ఉరితీశారు. అర్ధరాత్రి విచారణ తరువాత, మరణశిక్షను సమీక్షించాలని కోరుతూ దోషుల్లో ఒకరు దాఖలు చేసిన చివరి నిమిషంలో చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ అనే నలుగురిని తెల్లవారుజామున 5:30 గంటలకు ఢిల్లీ తీహార్ జైలులో ఉరితీశారు.

ఉరి తీసిన తర్వాత వారి మృతదేహాలను అంబులెన్సులలో దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యుల బృందం పోస్ట్ మార్టం పరీక్షలు నిర్వహించనుంది.

2012 డిసెంబర్‌లో ఢిల్లీ కదిలే బస్సులో నిర్భయ అని పిలవబడే 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య చేసినందుకు ఈ నలుగురు దోషులుగా నిర్ధారించారు. ఆమె గాయాలతో హాస్పిటల్ లో మరణించారు.