ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ

వార్ వన్ సైడ్ అయ్యిందని ఇన్నాళ్లు టీడీపీ శిబిరం సంబరపడింది. నిమ్మగడ్డను బేస్ చేసుకొని ఏపీ ప్రభుత్వం ఎంత ఇరుకునపెట్టారో అంతా పెట్టేశారు. చివరకు ఈ ఎపిసోడ్లో బలమైన సీఎం జగన్ ను ఓడించి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకంగా వైసీపీ సర్కార్ కు ఇష్టం లేకున్నా ఏపీ ఎన్నికల కమిషనర్ కుర్చీలో కూర్చున్నారు. కానీ పగబట్టిన వైసీపీ సర్కార్ అంత ఈజీగా వదులుతుందా? వదలదు కదా.. అందుకే ప్రతీకారం మొదలుపెట్టింది.  గతంలో నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన […]

Written By: NARESH, Updated On : September 3, 2020 9:15 am
Follow us on


వార్ వన్ సైడ్ అయ్యిందని ఇన్నాళ్లు టీడీపీ శిబిరం సంబరపడింది. నిమ్మగడ్డను బేస్ చేసుకొని ఏపీ ప్రభుత్వం ఎంత ఇరుకునపెట్టారో అంతా పెట్టేశారు. చివరకు ఈ ఎపిసోడ్లో బలమైన సీఎం జగన్ ను ఓడించి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకంగా వైసీపీ సర్కార్ కు ఇష్టం లేకున్నా ఏపీ ఎన్నికల కమిషనర్ కుర్చీలో కూర్చున్నారు. కానీ పగబట్టిన వైసీపీ సర్కార్ అంత ఈజీగా వదులుతుందా? వదలదు కదా.. అందుకే ప్రతీకారం మొదలుపెట్టింది.  గతంలో నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖపై సీఐడీ ప్రస్తుతం దర్యాప్తు జరుపుతోంది. దీంతో నిమ్మగడ్డ కూడా మళ్లీ పోరుబాట పట్టారు. హైకోర్టుకెక్కారు.

ఏపీ ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వంతో ఫైట్ చేసి మరీ నియామకమైన నిమ్మగడ్డ రమేశ్ మరోసారి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. ఎస్ఈసీ స్వతంత్రతను అణిచివేసేలా సర్కార్ ప్రయత్నిస్తోందని హైకోర్టును ఆశ్రయించారు. తమ సిబ్బందిపై సీఐడీ నమోదు చేసిన కేసు రాజ్యాంగ విరుద్ధమని.. సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.

తాజాగా ఏపీ సీఐడీ అధికారులు ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్ ను అందులోని డేటాను తీసుకెళ్లారని.. వారు స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో వేసిన పిటీషన్ లో ప్రస్తావించారు. తాను కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారంపై సీఐడీ అధికారులు ఆరాతీశారని.. సాంబమూర్తిని వేధించి సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు.

ఇక బాధిత ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ తనపై నమోదుచేసిన కేసును కొట్టివేయాలని కోరారు.

దీంతో ఈ రెండు పిటీషన్లను కలిపి విచారణ జరుపుతామన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.ఈ పరిణామం నిమ్మగడ్డపై ఏపీ సర్కార్ మళ్లీ నజర్ పెట్టిందని అర్థమవుతోంది. వీరిద్దరూ ఫైట్ ఇప్పుడు ఏపీలో టామ్ అండ్ జెర్రీని తలపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.