https://oktelugu.com/

Donald Trump: ఆమె గెలుపు.. డోనాల్డ్ ట్రంప్ కు స్పీడ్ బ్రేకర్

దక్షిణ కరోలినాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో నిక్కి ఓడిపోయారు. ఇది ఆమె సొంత రాష్ట్రం. ఆమె ఓటమి నేపథ్యంలో అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటారని వార్తలు వినిపించాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 4, 2024 / 04:49 PM IST

    Nikki Haley and Donald Trump

    Follow us on

    Donald Trump: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ గత కొద్దిరోజులుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇక తనే అభ్యర్థినని తన అనుచరులకు సంకేతాలు ఇస్తున్నారు. అయితే అతడికి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ(Nikki Haley) నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ ట్రంప్.. ఎదురన్నదే లేకుండా విజయాలు సాధిస్తున్నారు. అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. అయితే ఆదివారం డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున హేలీ విజయం సాధించారు. దీంతో డోనాల్డ్ ట్రంప్ కు స్పీడ్ బ్రేకర్ పడ్డటయింది. అయితే ఈ విజయం హేలీకి ఉపశమనం మాత్రమే ఇచ్చింది. ఆమె ట్రంప్ ను అధిగమించాలంటే మంగళవారం జరిగే పలు ప్రైమరీల్లో భారీ గెలుపు నమోదు చేయాల్సి ఉంటుంది.

    ఇటీవల దక్షిణ కరోలినాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో నిక్కి ఓడిపోయారు. ఇది ఆమె సొంత రాష్ట్రం. ఆమె ఓటమి నేపథ్యంలో అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటారని వార్తలు వినిపించాయి. అయితే తాను రేసు నుంచి వైదొలగనని ఆమె ప్రకటించారు. మరోవైపు ట్రంప్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. ఆయనకు చెక్ పెడతానని.. అధ్యక్ష బరిలో తానే ఉంటానని నిక్కీ ప్రచారం చేస్తున్నారు. నిక్కీ విజయం సాధించిన డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా డెమోక్రట్లకు కంచుకోట లాంటిది. అక్కడ 23,000 మంది మాత్రమే రిపబ్లికన్లు ఉన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో 92 శాతం ఓట్లు సాధించడం విశేషం.

    నిక్కి హేలీ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో విజయం సాధించిన నేపథ్యంలో ట్రంప్ కు అనుకోకుండా స్పీడ్ బ్రేకర్ పడింది. కానీ శనివారం ఆయన మీసోరి, మిషిగన్, ఐడహో లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో నిక్కీ పై విజయం సాధించారు. ఇప్పటివరకు ట్రంప్ తన ఖాతాలో 244 ప్రతినిధులను కలిగి ఉన్నారు. హేలీ వెంట కేవలం 24 మంది ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవాలంటే కనీసం 1,215 మంది ప్రతినిధులను కలిగి ఉండాలి. ఇక ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే ట్రంప్ మంగళవారం జరిగే 15 రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయని అమెరికా మీడియా వర్గాలు ఉంటున్నాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తే ట్రంప్ వెంట 1215 మంది ప్రతినిధులు ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయనను నిలువరించడానికి హేలీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది.