https://oktelugu.com/

AP Ticket Prices: ఏపీలో కొత్త‌గా పెరిగిన టికెట్ల రేట్లు ఇలా ఉన్నాయి..!

AP Ticket Prices: ఏపీలో టికెట్ల రేట్ల వివాదానికి ఎట్ట‌కేల‌కు ముగింపు ప‌లికిన‌ట్టు అయింది. నిన్న చిరంజీవితో పాటు మ‌హేశ్‌, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి, కొరాటాల శివ లాంటి వారంతా వెళ్లి జ‌గ‌న్ తో మాట్లాడారు. అయితే వారంద‌రి విన్న‌పం మేర‌కు జ‌గ‌న్ కూడా ఈ అంశంపై కొత్త నిర్ణ‌యాలు తీసుకున్నారు. దీంతో రిలీజ్ కు రెడీగా ఉన్న పెద్ద సినిమాల‌కు ఇది ఎంతో దోహ‌ద‌ప‌డుతుందిన ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు సినీ పెద్ద‌లు. అయితే ఈ రేట్లు అటు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 11, 2022 / 11:46 AM IST
    Follow us on

    AP Ticket Prices: ఏపీలో టికెట్ల రేట్ల వివాదానికి ఎట్ట‌కేల‌కు ముగింపు ప‌లికిన‌ట్టు అయింది. నిన్న చిరంజీవితో పాటు మ‌హేశ్‌, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి, కొరాటాల శివ లాంటి వారంతా వెళ్లి జ‌గ‌న్ తో మాట్లాడారు. అయితే వారంద‌రి విన్న‌పం మేర‌కు జ‌గ‌న్ కూడా ఈ అంశంపై కొత్త నిర్ణ‌యాలు తీసుకున్నారు. దీంతో రిలీజ్ కు రెడీగా ఉన్న పెద్ద సినిమాల‌కు ఇది ఎంతో దోహ‌ద‌ప‌డుతుందిన ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు సినీ పెద్ద‌లు.

    AP Ticket Prices

    అయితే ఈ రేట్లు అటు సినీ ఇండ‌స్ట్రీకి న‌ష్టం చేకూర్చ‌కుండా, ఇటు ప్రేక్ష‌కుల‌పై ఎక్కువ భారం ప‌డ‌కుండా ఉండేలా జ‌గ‌న్ మంచి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చిరంజీవి మీడియాకు వెల్ల‌డించారు. అయితే ఈ నెల నుంచే విడుద‌ల కాబోతున్న సినిమాల‌కు ఈ కొత్త నిర్ణ‌యం వ‌ర్తించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే
    ఈ నెలాఖరునుంచి పెరిగిన ధ‌ర‌లు అమ‌లు కాబోతున్నాయి.

    కాగా గ‌తంలో ఉన్న మూడే కేట‌గిరీల్లో ఏమైనా మార్పు ఉందా లేదా అన్న‌ది ఇంకా క్లారిటీ రాలేదు. కాగా కొత్త నిర్ణ‌యం ప్ర‌కారం.. ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో మల్టీప్లెక్సుల్లో టికెట్ రేటు రూ.150 ఉంటే.. ఏసీ థియేటర్లలో మాత్రం గ‌రిష్టంగా రూ.100 ఉంటే.. కనిష్టంగా రూ.70 ఉన్నాయి. నాన్ ఏసీ థియేట‌ర్ల‌లో మాత్రం గ‌రిష్టంగా రూ.60 ఉంటే.. కనిష్టంగా రూ.40 ఉన్నాయి. మున్సిపాల్టీ ప‌రిధిల్లో మల్టీప్లెక్సుల రేటు రూ.125గా ఉంది.

    AP Ticket Prices

    Also Read: సినీ రంగ సమస్యలు తొలిగినట్లేనా..?ఈ భేటీతో ఎవరికి ప్రయోజనం..?
    ఇదే మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో గ‌రిష్టంగా రూ.80 ఉంటే.. క‌నిష్టంగా రూ.60 గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అదే నాన్ ఏసీ థియేటర్లలో గ‌రిష్టంగా రూ.50 ఉంటే.. కనిష్టంగా రూ.30 ఉన్నాయి. ఇక నగర పంచాయితీల విష‌యానికి వ‌స్తే మల్టీప్లెక్సుల్లో రూ.100 ఉండే విధంగా నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇదే పంచాయ‌తీల్లో ఏసీ థియేటర్లలో అయితే గ‌రిష్టంగా రూ.70 ఉండ‌గా.. క‌నిష్టంగా రూ.50 ఉంచారు. ఇక నాన్ ఏసీ థియేట‌ర్ల‌లో అయితే గ‌రిష్టంగా రూ.40 ఉంటే.. క‌నిష్టంగా రూ.20 ఉంచారు. చివ‌ర‌గా రిక్లయినర్ సీట్ల ధరను రూ.250 గా డిసైడ్ చేశారు.

    అయితే ఈ రేట్ల‌పై చిరంజీవి టీమ్ సంతోషం వ్య‌క్తం చేసింది. ఇది ఇండ‌స్ట్రీకి ఎంతో మంచి చేసే నంబ‌ర్ అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు చిరంజీవి. ఇక టాలీవుడ్ నిర్మాత‌లు కూడా ఈ పెంచిన ధ‌ర‌ల మీద సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

    Also Read: తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవినే పెద్ద దిక్కా?

    Tags