Aadavallu Meeku Johaarlu: శర్వానంద్, రష్మిక జోడీగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ నెల 25న రిలీజ్ కానున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కగా.. టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను SLV బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

శర్వానంద్ ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ మధ్య శర్వానంద్ కెరీర్ చాలా డౌన్ లో ఉంది. కాబట్టి.. ఈ సినిమా అతనికి బాగా ప్లస్ కానుంది. పైగా ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. శర్వానంద్, రష్మిక జోడీ కూడా బాగా కుదిరింది. అందుకే.. సినిమాని అనుకున్న రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. దాంతో ఇప్పుడు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతతో గొడవకు దిగుతున్నారు.
Also Read: మళ్లీ మొదలైంది మూవీ రివ్యూ..
ఎందుకంటే ఎప్పుడో ఈ సినిమాకు డీల్స్ కుదిరాయి. డీల్స్ కుదుర్చుకున్న తర్వాత రేట్లు పెంచడం కరెక్ట్ కాదు అని డిస్ట్రిబ్యూటర్లు వాదన. ఒకవేళ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా లాభాలు రావు అని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. అందుకే.. ముందు అనుకున్న రేటుకే సినిమాని ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
లేదు అంటే.. మేము ఇచ్చిన మొత్తంలో కనీసం 35 శాతం అయినా తమకు వెనక్కి ఇవ్వాలని, లేదంటే తమకు నష్టాలు తప్పవని వాళ్లంతా నిర్మాతల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, నిర్మాతల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. సినిమా రిలీజ్ అయ్యాక, నిజంగానే నష్టాలు వస్తే.. అప్పుడు కచ్చితంగా ఆదుకుంటాం అని చెబుతున్నారట. కానీ, మా డబ్బు తీసుకుని మమ్మల్ని ఆదుకున్నేది ఏమిటి ? అంటూ డిస్ట్రిబ్యూటర్లు సీరియస్ అవుతున్నారు.
Also Read: హిజాబ్ వివాదం: ఏమిటీ మత మౌఢ్యం?
