పీసీసీ జీవితకాలం లేటే..మళ్లీ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. పార్టీ నిర్వీర్యం అయిపోతున్నా అధిష్టానం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా భవిష్యత్తు అంధకారంగా మారనుంది. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. చివరికి ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. హైకమాండ్ సర్వేలు, నివేదికలు, అభిప్రాయ సేకరణ పేరుతో కాలయాపన చేస్తుండటంతో పదవి ఆశిస్తున్న ఆశావహుల్లో సైతం ఓపిక నశిస్తోంది. ప్రధాన పోటీదారులైన రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య […]

Written By: Srinivas, Updated On : June 22, 2021 12:08 pm
Follow us on

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. పార్టీ నిర్వీర్యం అయిపోతున్నా అధిష్టానం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా భవిష్యత్తు అంధకారంగా మారనుంది. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. చివరికి ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. హైకమాండ్ సర్వేలు, నివేదికలు, అభిప్రాయ సేకరణ పేరుతో కాలయాపన చేస్తుండటంతో పదవి ఆశిస్తున్న ఆశావహుల్లో సైతం ఓపిక నశిస్తోంది. ప్రధాన పోటీదారులైన రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో మధ్యే మార్గంగా మరో వ్యక్తిని పీసీసీ చీఫ్ గా నియమిస్తారనే ప్రచారం జోరందుకుంది. గతంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జరగడంతో ఆయన విముఖత ప్రకటించారు. దీంతో ఇప్పుడు వేరే నాయకుడి వేటలో పడింది. తాజాగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఆయన కూడా పదవి చేపట్టేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురుచూస్తున్నారు.
అయితే కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేసే నాయకుడు కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. దీంతో అధిష్టానం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక వాయిదా వేస్తూ వస్తోంది.

కేసీఆర్ కు ప్రత్యామ్నాయం అయ్యే నాయకుడికైతే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని పలువురు కార్యకర్తల అభిప్రాయం. లేకపోతే పార్టీపై ఆశలు వదిలేసుకోవడమేనని చెబుతున్నారు. పార్టీని గాడిన పెట్టే వారైతే కోల్పోయిన పూర్వ వైభవం తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు. దీంతో పార్టీ ఎవరికి మద్దతు పలికి పదవి కట్టబెడుతుందోనని వేచి చూడాల్సిందే.