
రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆయన గురించి తెలిసిన వాళ్లు చంద్రబాబును రాజకీయ చాణిక్యుడిగా, అపర మేధావిగా వర్ణిస్తుంటారు. ఎంతటి క్లిష్ట సమస్యలనైనా సులువుగా పరిష్కరించగల నేర్పరి అని ఎలాంటి సమస్య వచ్చినా చంద్రబాబు భయపడరని టీడీపీ వర్గాల్లో ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అయితే చంద్రబాబుకు వయస్సు మీద పడుతోంది.
Also Read : ఉత్తరాంధ్రలో టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి మరో ఎమ్మెల్యే
ఏడు పదుల వయస్సులో రాజకీయాలు చేయడం అంత సులభం కాదు. కుమారుడు లోకేశ్ కు బాధ్యతలు అప్పగిద్దామని చంద్రబాబు భావిస్తున్నా టీడీపీ నేతలు, కార్యకర్తలు అందుకు సుముఖంగా లేరు. లోకేశ్ ను కాదని మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించడానికి చంద్రబాబు ఇష్టపడడు. ఏపీలో టీడీపీ బలంగా ఉంటే లోకేశ్ కు పార్టీ పట్టాలు అప్పగించినా ఎలాగోలో నెట్టుకొచ్చేవారు. అయితే ఏపీలో టీడీపీ మాత్రం రోజురోజుకు బలహీనపడుతోంది.
ఇలాంటి సమయంలో చంద్రబాబుకు మరో కొత్త టెన్షన్ మొదలైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుండటం గమనార్హం. సుప్రీం కోర్టు తాజాగా నేర చరిత్ర గల నేతల విషయంలో యాక్షన్ ప్లాన్ కోసం హైకోర్టులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇతర రాజకీయ నేతల్లాగే చంద్రబాబు గుండెల్లో కూడా రైళ్లు పరుగెడుతున్నాయని తెలుస్తోంది. చంద్రబాబుపై చాలా కేసులు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి.
చాలా కేసులపై చంద్రబాబు కోర్టుల్లో స్టేలు తెచ్చుకున్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని చంద్రబాబు చెబుతున్నా వైసీపీ ఆరోపణల ప్రకారం చంద్రబాబుపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తోంది. సుప్రీం ఆదేశాలతో టీడీపీ నేతలు సైతం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సుప్రీం తాజ ఆదేశాలతో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
Also Read : కేంద్రంలో వియ్యం.. రాష్ట్రంలో కయ్యం..