
తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ కి వచ్చే వారికి కేసీఆర్ సర్కార్ కొత్త ఆదేశాలను జారీ చేసింది. వేరే రాష్ట్రాలకు వెళ్ళే వారు ఇక నుండి డీ.జీ.పీ.కార్యాలయం నుండి పాసులు తీసుకొవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రా, కర్ణాటక, మహరాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్ లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా వాహన పాసులను అడగడం లేదని వెల్లడించారు.
ఇప్పటి వరకు అంతరాష్ట్ర ప్రయాణాలకు డీ.జీ.పీ కార్యాలయం నుండి ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తి వేస్తూ అంతర రాష్ట్ర ప్రయాణాలకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్ పోర్ట్ పాసులను జారీ చెయడాన్ని పోలీసు శాఖ నిలిపి వేసింది.
అయితే, ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సిన వారు స్పందన యాప్ , కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేవారు ఆ రాష్ట్రానికి చెందిన సేవా యాప్ లోనూ, మహరాష్ట్రకు వెళ్లే వారు ఆ రాష్ట్ర పోర్టల్ లో ప్రయాణికుల వివరాలను నమోదు చెయాల్సి ఉంటుందని అధికారులు స్పస్టంచెసారు