
జూన్ నుంచే టాలీవుడ్లో షూటింగులను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లిమిటెడ్ మెంబర్లతో షూటింగులకు ప్రారంభించేందుకు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ముందుగా స్టార్స్ లేకుండా సినిమాలను తెరకెక్కించేందుకు దర్శకులు సిద్ధమవుతున్నారు. ముందుగా టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కున్న RRR మూవీ షూటింగ్ ప్రారంభించనుందని తెలుస్తోంది. ఈమేరకు దర్శకుడు రాజమౌళి సినిమాను ఏవిధంగా ప్రారంభించాలి? ఎవరెవరు ఏయే పనులు చేయాలి? ఎంతమంది సెట్లో ఉండాలి? ఎంత సమయంలో షూటింగ్ ముగించాలని అనే వాటిపై ఇప్పటికే ఓ ప్లాన్ రూపొందించినట్లు సమాచారం.
ఈమేరకు అతి త్వరలోనే RRR మూవీ ప్రారంభించబోతున్నారని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. తొలుత మూవీకి సంబంధించి సెట్స్, ప్యాచ్ వర్క్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కొందరు క్యారెక్టర్ ఆర్టిసులతో మూవీ షూటింగులను ప్రారంభిస్తారట. ఆ తర్వాత పరిస్థితిని బట్టి హీరోలు షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ముందుగా హీరోలు లేకుండా ఉండే సన్నివేశాలను పూర్తి చేసి ఆ తర్వాత అవసరాన్ని వీరిని రంగంలోకి దింపనున్నారట. కాగా ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్నారు.
అల్లూరి సీతరామరాజుగా రాంచరణ్, కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కన్పించబోతున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ షూటింగ్ ప్రారంభించాకే మిగతా దర్శకులు కూడా ఈ తరహాలో షూటింగులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. RRR మూవీ టాలీవుడ్ దర్శకులకు షూటింగులపై దిక్సూచిగా మారింది. దీంతో RRR షూటింగు ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని అభిమానులతోపాటు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఆసక్తితో ఎదురుచూస్తోంది.