https://oktelugu.com/

Aadhaar Card : పిల్లల ఆధార్‌ నమోదు కోసం ఇక కొత్త నిబంధన

Aadhaar Card : పిల్లలకు ఆధార్ కార్డు జారీలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల సంరక్షకులుగా తల్లిదండ్రులు ఉండాలని సూచించింది. దీనికి గాను మూడు రకాల దరఖాస్తు ఫారాలను తయారు చేసింది. చిన్న పిల్లలకు ఒక మాదిరి, పెద్ద వారికి మరో మాదిరి, యువకులకు ఇంకో రకంగా ఉండేలా దరఖాస్తు ఫారాలు ఉండేలా చర్యలు తీసుకుంది. దీంతో ఇకపై ఆధార్ నమోదులో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2023 / 01:51 PM IST
    Follow us on

    Aadhaar Card : పిల్లలకు ఆధార్ కార్డు జారీలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల సంరక్షకులుగా తల్లిదండ్రులు ఉండాలని సూచించింది. దీనికి గాను మూడు రకాల దరఖాస్తు ఫారాలను తయారు చేసింది. చిన్న పిల్లలకు ఒక మాదిరి, పెద్ద వారికి మరో మాదిరి, యువకులకు ఇంకో రకంగా ఉండేలా దరఖాస్తు ఫారాలు ఉండేలా చర్యలు తీసుకుంది. దీంతో ఇకపై ఆధార్ నమోదులో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనికి గాను పలు చర్యలు తీసుకుంటోంది.

    మూడు దరఖాస్తు ఫారాలు

    యూఐడీఏఐ సంస్థ ఇటీవల దీనికి సంబంధించిన వివరాలు జారీ చేసింది. మూడు దరఖాస్తు ఫారాలను నింపి వారికి అవసరమైన విధంగా ఆధార్ కార్డును నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫారాలను యూఐడీఏఐ చాలా జాగ్రత్తగా రూపొందించింది. ఎక్కడ కూడా విమర్శలు రాకుండా చూసుకుంది. అందరిలో అభాసుపాలైతే ప్రతిష్ట కోల్పోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో తాజాగా రెడీ చేసింది. ఇందులో ఎలాంటి లోపాలు ఉండకుండా చూసుకుంది. ఇక మీదట ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసే క్రమంలో ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించడం గమనార్హం.

    15 నుంచి అందుబాటులోకి..

    ఈ నెల 15వ తేదీ వరకు మూడు రకాల దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటోంది. దరఖాస్తు ఫారాలు అన్ని భాషల్లో తయారుకు ప్రణాళికలు రెడీ చేసింది. ఆధార్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యే సంఖ్య కావడంతో ముందస్తుగానే అన్ని రకాలుగా చూసుకున్నాక విడుదల చేస్తున్నారు. ఒకసారి ప్రింట్ అయితే మళ్లీ తీసివేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ముందే అన్ని రకాలుగా చెక్ చేసుకుని దానికి సంబంధించిన వివరాలు పొందుపరచి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

    ప్రత్యేకంగా..

    18 ఏళ్లు పైబడిన వారికి కూడా ప్రత్యేకంగా ఫారం రూపొందించారు. యూఐడీఏఐ సంస్థ సూచనల మేరకు దరఖాస్తు ఫారాలు రెడీ చేశారు. ఇక మీదట ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ కార్డును తయారు చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇన్నాళ్లుగా ఆధార్ కార్డుల జారీలో అవకతవకలు జరిగితే మళ్లీ వారు కార్యాలయాల చుట్టు తిరిగేవారు. కానీ ఇప్పుడు ఆ సమస్య లేకుండా చూసుకుంటున్నారు. ఎలాంటి సమస్య అయినా చిటికెటో పరిస్కారం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆధార్ లో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.