https://oktelugu.com/

కేసీఆర్ రెవిన్యూ ప్రక్షాళన విప్పిన ఫామ్ హౌస్ గుట్టు..!

  “కెసిఆర్”, “ఫామ్ హౌస్” ఈ రెండు పదాలను చాలా రోజులుగా మనం కలిపే వింటున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అందులో ఎకరన్నర విస్తీర్ణంలో ఒక భారీ భవంతి కూడా ఉంది. అయితే ఈ 100 ఎకరాల్లో కేసీఆర్ కే కాదు. అతని కొడుకు కేటీఆర్ కూడా వాటా ఉంది. చివరికి ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ విడమర్చి చెప్పే పరిస్థితి వచ్చింది. దీనంతటికీ కారణం అతను తన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 6, 2020 / 09:33 AM IST
    Follow us on

     

    “కెసిఆర్”, “ఫామ్ హౌస్” ఈ రెండు పదాలను చాలా రోజులుగా మనం కలిపే వింటున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అందులో ఎకరన్నర విస్తీర్ణంలో ఒక భారీ భవంతి కూడా ఉంది. అయితే ఈ 100 ఎకరాల్లో కేసీఆర్ కే కాదు. అతని కొడుకు కేటీఆర్ కూడా వాటా ఉంది. చివరికి ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ విడమర్చి చెప్పే పరిస్థితి వచ్చింది. దీనంతటికీ కారణం అతను తన రాష్ట్రంలో విప్లవాత్మకంగా తీసుకురావాలనుకుంటున్న రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అంశమే అని అర్థమవుతోంది. గతంలో ఈ అంశానికి సంబంధించి కిందిస్థాయి వ్యక్తుల వద్ద ఫీడ్ బ్యాక్ తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు కిందిస్థాయి సిబ్బందితో ప్రక్షాళన అంశాలను డిస్కస్ చేస్తున్నారు.

    వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవికి సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఇళ్ల నిర్మాణం, అనుమతులు, పన్నులు వంటి విషయాలపై మాట్లాడారు. ఇదే సందర్భంలో పొలంలో కట్టుకున్న ఇల్లు నమోదు చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదని…. ఆ పంచాయతీ కార్యదర్శి చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన సొంత ఫామ్ హౌస్ ప్రస్తావన తీసుకువచ్చారు. అసలు పొలంలో కట్టిన ఇళ్ళు ని నమోదు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రానున్న తరుణంలో తన ఫాంహౌస్ ఎంత ఉంది…. అందులో ఎంత స్థలం లో ఇల్లు ఉంది దానికి పర్మిషన్ ఎలా తెచ్చుకున్నాడు అనే వివరాలను ఆమెకు చెప్పారు. దీంతో పొలం లో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న వారు ఇవన్నీ తీసుకోవాల్సిందేనని లేకపోతే ఇబ్బంది పడతారని ఆయన సూచించారు.

    ముందు నుండి ఈ ఫామ్ హౌస్ పై ఎన్నో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా సందర్భాల్లో అమెరికాలో ఉద్యోగం చేసిన కేటీఆర్ అలా వచ్చిన సొమ్ముతో దీనిని కొనుగోలు చేశారని చెబుతారు. అయితే ఎలక్షన్ అఫిడవిట్ లో కేసీఆర్ పేరు మీద కూడా కొన్ని భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. మరి కేటీఆర్ ఉద్యోగం చేస్తేనే ఇవన్నీ కూడా వచ్చాయా..? ఇది ఎవరికీ తెలియదు. ఇక వంద ఎకరాల స్థలం…. అందులో ఒక డబల్ బెడ్ రూమ్ డూప్లెక్స్ హౌస్ కట్టుకునేంత కేటీఆర్ సంపాదించారా అని అనుమానం. ఇటీవల కాలంలో దాన్ని పడగొట్టి మళ్లీ పెద్ద ఇల్లు కట్టాడు. ఆ ఫోటోలు ఎలా ఉంటాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ కేసీఆర్ నోటి నుండి మాత్రమే ఎకరన్నర విస్తీర్ణంలో ఆ ఇల్లు ఉంటుందని అన్న మాట వచ్చింది. మరి విపక్షాలకు ఈ మాత్రం చాలదా అతని పై రెచ్చిపోయేందుకు…