ముఖేశ్‌ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్‌ అంచనా వేయగలమా..!

రిలయన్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపనీస్‌ నుంచి ఇద్దరు అన్నదమ్ములైన అనిల్ అంబానీ, ముఖేశ్‌ అంబానీ ఏళ్ల క్రితమే విడిపోయారు. దీంతో ముఖేశ్‌ అంబానీ జియో కమ్యూనికేషన్‌ను స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ జియో కమ్యూనికేషన్‌ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. గ్రామాల స్థాయి వరకూ ఇప్పుడు ఇంటర్నెట్‌ చేరిందంటే ఆ క్రెడిట్‌ జియోదే అని చెప్పాలి. Also Read: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ముఖేశ్‌ అంబానీ కోట్లకు […]

Written By: NARESH, Updated On : September 6, 2020 9:56 am

Mukesh Ambani family life

Follow us on


రిలయన్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపనీస్‌ నుంచి ఇద్దరు అన్నదమ్ములైన అనిల్ అంబానీ, ముఖేశ్‌ అంబానీ ఏళ్ల క్రితమే విడిపోయారు. దీంతో ముఖేశ్‌ అంబానీ జియో కమ్యూనికేషన్‌ను స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ జియో కమ్యూనికేషన్‌ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. గ్రామాల స్థాయి వరకూ ఇప్పుడు ఇంటర్నెట్‌ చేరిందంటే ఆ క్రెడిట్‌ జియోదే అని చెప్పాలి.

Also Read: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్

అలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ముఖేశ్‌ అంబానీ కోట్లకు పడగలెత్తారు. అపర కుబేరుడిగా ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో నిలిచారు. భారతదేశంలో అత్యంత ధనవంతుడిగానూ కొనసాగుతున్నారు. బడా వ్యాపార వేత్త.. బిలియనీర్‌‌గా ప్రఖ్యాతలు గడించిన అంబానీ ఫ్యామిలీ ఎంత లగ్జరీగా ఉంటుందో అంచనా వేయగలమా. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్‌ను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసిందని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఈ మొత్తం నికర విలువ 79.7 బిలియన్ డాలర్లలో స్వల్పంగా మాత్రమే తగ్గింది.

ముఖేశ్ అంబానీ బిజినెస్ వ్యవహారాల మాట అటుంచితే.. అంబానీ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో విలాసవంతంగా ఉంటుంది. అంబానీ కొనుగోలు చేసిన కొన్ని ఖరీదైన వస్తువులకు ఇంట్రెస్టింగ్‌ విషయాలు ఎన్నో ఉన్నాయి. సామాన్యుడు కూడా ఊహించలేని అందులో ఆ ఐదు ఖరీదైన అంబానీ సొంతమైన వాటి గురించి తెలుసుకుందాం..

కొన్ని రోజుల క్రితం, ఫోర్బ్స్ మ్యాగజైన్ 20 బిలియనీర్ల గృహాల జాబితాను విడుదల చేసింది. ఆ ఫోర్బ్స్ జాబితాలో అంటిలియా అగ్రస్థానంలో నిలిచింది. ఒక బిలియన్ డాలర్ల విలువైన ఈ 27 అంతస్తుల భవనం ఎవరిదో కాదు.. ముంబైలోని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ నివాసం. ఇందులో 9 హై-స్పీడ్ ఎలివేటర్లు, గ్రాండ్ బాల్రూమ్, థియేటర్, స్పా, టెంపుల్, మల్టీ టెర్రస్ గార్డెన్లు ఉన్నాయి. అంటిలియా భవనంలో చల్లని పిల్లగాలుల్లా వీచే స్నో రూమ్ ఆకర్షణీయంగా ఉంటుంది. అంటిలియాలో కృత్రిమంగా మంచు కురుస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంటుంది. చల్లగా ఉండే ఆ గదిలోకి వెళ్లగానే మంచు ప్రదేశంలో తేలియాడుతున్న ఫీలింగ్‌ వస్తుంది. భారతదేశంలో అంబానీ స్నో రూమ్ చాలా స్పెషల్. ఇందులో 168 కార్ల వరకు పార్క్ చేయొచ్చు. దీని పైకప్పుపై మూడు హెలిప్యాడ్లు ఉన్నాయి.

Also Read: రామ మందిరం ఓకే.. మరి బాబ్రీ నిర్మాణం ఎలా ఉండబోతోంది..?

ఎంతో ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ BMW కారును ఇటీవలే అంబానీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ సుమారు రూ.8.5 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారు BMW 760Li కారును వాడుతున్నారు. BMW ఫ్యూయిల్ ట్యాంక్ ఆటోమాటిక్ -సీలింగ్ కెవ్లార్‌తో తయారు చేశారు. మంటలు కూడా అంటుకోదు. ప్రతి విండో 65 మి.మీ మందంతో బుల్లెట్ ప్రూఫ్ 150 కిలోల బరువు ఉంటుంది. ముఖేష్, నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా నాలుగు సార్లు ఐపీఎల్, రెండుసార్లు CLT20 ఛాంపియన్స్, ముంబై ఇండియన్స్ (MI)లకు ప్రాంచైజీగా వ్యవహరిస్తోంది. ఈ టీమ్ 2008లో ఏర్పడింది. 2017లో 100 మిలియన్ డాలర్ల విలువను అధిగమించిందని ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ది వరల్డ్స్ రిచెస్ట్ స్పోర్ట్స్ టీం ఓనర్స్ జాబితాలో 2019లో ముంబై ఇండియన్స్‌ టీంతో ముఖేశ్ టాప్ ర్యాంకులో నిలిచారు.