New Ration Card : కొన్నిసార్లు ఒక బంధం శాశ్వతంగా కొనసాగిన కూడా మరికొన్ని సందర్భాలలో మాత్రం విడాకులు తీసుకోవడం తప్పనిసరిగా మారుతుంది. మన రోజువారి జీవితంలో చాలా ముఖ్యమైన పౌర సేవలలో రేషన్ కార్డు కూడా ఒకటి. దీనికి సంబంధించి చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. విడాకులు తీసుకున్న వాళ్లు అలాగే లీగల్ గా విడిపోయిన వారు కొత్తగా రేషన్ కార్డు పొందడం ఎలా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం కొంతమంది సందేహాలను తీరుస్తూ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం పౌరులకు మరింత సులభంగా సేవలను అందిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం విడాకులు తీసుకున్న వారికి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
విడాకులు తీసుకున్న మహిళలు కానీ పురుషులు కానీ తమ విడాకుల లీగల్ పత్రాలను ఆధారంగా చేసుకుని వారు కొత్త రేషన్ కార్డులను పొందవచ్చు. దీనికోసం వాళ్లు గ్రామ వార్డు సచివాలయ హౌస్ మ్యాపింగ్ డేటా బేసిస్ లో ముందుగా కుటుంబ విభజన చేయించుకోవాలి. ప్రస్తుతం మీరు ఉన్న ఇంటి నుంచి విడిపోయారు అనే విషయం గ్రామ వార్డు సచివాలయ డేటాలో ముందుగా అప్డేట్ చేసుకోవాలి. విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది మహిళలు ఆర్థికంగా అలాగే భౌతికంగా కూడా పూర్తిగా వేరేగా జీవిస్తూ ఉంటారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో వీరు భాగస్వామి కావాలంటే వీళ్ళ కుటుంబం వేరేగా ఉన్నట్లు గుర్తించబడాలి.
విడాకులు తీసుకున్న వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళు మున్సిపల్ సర్టిఫికెట్ తో పాటు కోర్టు విడాకుల ఉత్తరువు వంటి లీగల్ డాక్యుమెంట్స్ కూడా తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలంటే మీరు ముందుగా మీ గ్రామా లేదా వార్డు సచివాలయంలో కుటుంబ విభజన ఫారంను పూర్తి చేయాలి. ఆ తర్వాత కొత్త హౌస్ హోల్డ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో కూడా ఈ ప్రక్రియ అందుబాటులో ఉంది.