https://oktelugu.com/

‘జగన్‌ లేఖ’పై కొత్త కోణం.? సీజే పక్కన పడేస్తాడా..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఓ సుప్రీం కోర్టు జడ్జిపై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ లేఖపై రచ్చ కొనసాగుతోంది. ఈ లేఖపై న్యాయవాదులు రెండు వర్గాలుగా వీడి కొందరు సమర్థిస్తుండగా మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషన్‌ లాంటి వారు జగన్‌ లేఖ రాయడం తప్పేమీ కాదంటుండడంతో ఇంకొందరు న్యాయవాదులు న్యాయవ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదంటూ విమర్శిస్తున్నారు. Also Read: ఏపీ సర్కార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 09:56 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఓ సుప్రీం కోర్టు జడ్జిపై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ లేఖపై రచ్చ కొనసాగుతోంది. ఈ లేఖపై న్యాయవాదులు రెండు వర్గాలుగా వీడి కొందరు సమర్థిస్తుండగా మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషన్‌ లాంటి వారు జగన్‌ లేఖ రాయడం తప్పేమీ కాదంటుండడంతో ఇంకొందరు న్యాయవాదులు న్యాయవ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదంటూ విమర్శిస్తున్నారు.

    Also Read: ఏపీ సర్కార్ తో మళ్లీ ఫైటింగ్ కు దిగిన నిమ్మగడ్డ.. హైకోర్టులో పిటీషన్

    ఇదివరకు ఎన్నో సందర్భాల్లో ఇలాంటి లేఖలు రాసినా కొన్నింటికి స్పందన రాగా.. మరికొన్నింటిని పక్కన పడేశారని సీనియర్‌ న్యాయవాదులు అంటున్నారు. ఈ నేపథ్యలో జగన్‌ రాసిన లేఖను సైతం ప్రధాన న్యాయమూర్తి పట్టించుకోవడం లేదా..? అనే చర్చ సాగుతోంది.

    జగన్ ఆరోపించిన జడ్జి ఇప్పుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పదవి రేసులో ఉన్నారు. ఈ ఫిర్యాదులపై జాతీయ మీడియా సైతం రంగంలోకి దిగి చర్చలు, డిబేట్‌లు పెడుతోంది. అంతేకాకుండా అంతకుముందు ఏపీ హైకోర్టు ఇచ్చిన గాగ్‌ ఆర్డర్స్‌ నేపథ్యంలో ఈ లేఖ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మాత్రం ఇంతవరకు స్పందన తెలియజేయకపోవడం విశేషం.

    తాజాగా ఓ అడ్వకేట్‌ జనరల్‌ ఈ లేఖపై స్పందించాడు. జగన్‌ రాసిన లేఖను సీజే పక్కన పడేస్తాడని తాము అనుకోవడం లేదని మాజీ అడ్వకేట్‌ జనరల్‌ చింతల విష్ణుమోహన్‌రెడ్డ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం మరింత హీటెక్కింది. అయితే న్యాయమూర్తులపై ఇలాంటి లేఖలు కొత్తేమీ కాకుండా అన్నింటికి స్పందన రాలేదు. కాన్ని కొన్ని లేఖల విషయంలో మాత్రం సీరియస్‌గానే జరిగియి. గతంలో తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై విచారణ జరిగిందని, తప్పు చేస్తే ఎవరైనా విచారణను ఎదుర్కొవాలని విష్ణుమోహన్‌రెడ్డి వివరించారు.

    Also Read: ఏపీలో ప్రారంభమైన వైఎస్సార్ బీమా.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

    అయితే న్యాయమూర్తుల విచారణ సందర్భంగా ఇష్టానుసారం వ్యాఖ్యానించడానికి వీల్లేదని, ఏదైనా ఉంటే తీర్పుల్లో రాయవచ్చని, తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించవచ్చని ఆయన అన్నారు. మరోవైపు దుమ్మలపాటి శ్రీనివాస్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన గాగ్‌ ఆర్డర్స్‌పై కూడా చింతల స్పందించారు. శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఆపమని ఆదేశాలు సరికావన్నారు.