టీడీపీకి ఉప్పందిస్తున్నారు.. వైసీపీలో ఆ లీకు వీరులెవరు..?

రాజకీయాల్లో శత్రువులు.. మిత్రులు ఉంటారు. అందులోనూ అదే పార్టీలోనూ ఉంటూ.. అదే పార్టీలోని పెద్దలకు చేటు చేయాలని చూస్తుంటారు. ప్రతిపక్ష పార్టీతో జతకట్టి మరీ తమ కుటిల రాజకీయాలు సాగిస్తుంటారు. అయితే.. ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పలువురికి అనుమానాలు వస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీకి పార్టీ, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన నిర్ణయాలు లీకవుతున్నాయంట. అందుకే.. టీడీపీ నేత‌లు ఆధారాల‌తో స‌హా బ‌ట్టబ‌య‌లు చేస్తున్నార‌ని డౌట్‌ పడుతున్నారు. Also Read: ఏపీ సర్కార్ తో మళ్లీ ఫైటింగ్ […]

Written By: NARESH, Updated On : October 22, 2020 10:56 am
Follow us on

రాజకీయాల్లో శత్రువులు.. మిత్రులు ఉంటారు. అందులోనూ అదే పార్టీలోనూ ఉంటూ.. అదే పార్టీలోని పెద్దలకు చేటు చేయాలని చూస్తుంటారు. ప్రతిపక్ష పార్టీతో జతకట్టి మరీ తమ కుటిల రాజకీయాలు సాగిస్తుంటారు. అయితే.. ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పలువురికి అనుమానాలు వస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీకి పార్టీ, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన నిర్ణయాలు లీకవుతున్నాయంట. అందుకే.. టీడీపీ నేత‌లు ఆధారాల‌తో స‌హా బ‌ట్టబ‌య‌లు చేస్తున్నార‌ని డౌట్‌ పడుతున్నారు.

Also Read: ఏపీ సర్కార్ తో మళ్లీ ఫైటింగ్ కు దిగిన నిమ్మగడ్డ.. హైకోర్టులో పిటీషన్

ఇటీవ‌ల క‌ర్నూలుకు చెందిన మంత్రి గుమ్మనూరు జ‌య‌రాం విష‌యంలో రెండు కీల‌క విష‌యాల‌ను టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెట్టారు. ఈఎస్ఐ కేసులోనూ జ‌య‌రాం కుమారుడు బెంజి కారును గిఫ్ట్‌గా పొందారంటూ.. అయ్యన్న ఫొటోల‌తో స‌హా వెల్లడించారు. అంతేకాదు.. త‌ర్వాత ప‌రిణామంలో మంత్రి జ‌య‌రామ్ త‌న భార్య, త‌మ్ముళ్ల భార్యల‌తో పోగేసిన భూ దందాల‌ను కూడా ఆధారాల స‌హితంగా అయ్యన్న వెల్లడించారు. వీటన్నింటిని చూసిన వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అయ్యన్నది విశాఖ.. జయరాంది క‌ర్నూలు.. మరి అక్కడి వ్యక్తికి ఇక్కడ లీడర్‌‌ లీకులు ఎలా చేరాయి..? ఇంత సమాచారం ఎలా దొరికింది..? ఇదంతా ఆసక్తికరంగా మారింది. ఇక‌ విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ నాయ‌కుడు కొమ్మారెడ్డి ప‌ట్టాభి కూడా ప్రభుత్వంలోని మంత్రులు అవినీతి చేస్తున్నారంటూ.. కొన్ని ఆధారాల‌తో స‌హా వెల్లడించారు.

అందుకే ఈ పరిణామాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారంట. పైగా కొందరు మంత్రులు పెట్టుకున్న సలహాదారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ టీడీపీ బలమైన ఆరోపణలే చేస్తోంది. వీటన్నింటిని చూస్తుంటే.. మన వెంటే ఉన్న వారే మనకు ఇలాంటి నష్టం తెస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేల, పార్టీ, ప్రభుత్వ పెద్దలు అంచనాకు వచ్చారట.

Also Read: ఏపీలో ప్రారంభమైన వైఎస్సార్ బీమా.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

కొంతమంది సీనియర్‌‌ నేతల్లోనూ తమకు మంత్రి పదవులు రాలేదన్నట్లు అక్కసుతో ఉన్నారు. వారి కళ్ల ముందు జూనియర్లు మంత్రులు కావడం.. అంతేకాదు వారు చేస్తున్న పనులను కూడా భరించలేకుండా ఉన్నారట. అందుకే వీరు కూడా ప్రతిపక్షానికి సహకరిస్తున్నట్లు సమాచారం. మున్ముందు మంత్రి వర్గ విస్తరణ ఉండడంతో ఇప్పుడున్న మంత్రుల ఇమేజీని ఎలాగైనా డ్యామేజీ చేసి.. వారిని మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్లాన్‌ అని సమాచారం. వారిని తొలగిస్తే వీరికి పదవి దక్కుతుందని ఆశపడుతున్నారట. చివరికి ఈ ఇంటి రాజకీయాలు ఎటు దారితీస్తాయో చూడాలి మరి.