New Orleans : న్యూ ఓర్లీన్స్‌లోని బోర్బన్ స్ట్రీట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొందరు ప్రాణాలు విడిస్తే మరికొందరు గాయపడ్డారు. ఇంతకీ ఏం జరిగింది అంటే? కొత్త సంవత్సరం సందర్బంగా ప్రజల గుంపునే టెర్రరిస్టులు టార్గెట్ చేశారు అని సమాచారం. ఇందులో భాగంగా ప్రజలు గుంపుగా ఉన్న సమయంలో ఓ కారు వారి మీదకు తోసుకొని వెళ్లింది. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించాలి అనుకున్నారు కానీ ఇదొక టెర్రరిస్ట్ అటాక్ అని సమాచారం. ఈ ఘటనలో అనేక మంది వ్యక్తులు మరణించారు. చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయని FBI తెలిపింది.
FBI ప్రధాన దర్యాప్తు సంస్థ ఈ సంఘటనను ఉగ్రవాద చర్యగా పరిశోధిస్తుంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు అని సమాచారం. అయితే ఈ దాడికి పాల్గొంది షంసుద్ దిన్ జబ్బార్ అని సమాచారం. మరి ఈయన ఎవరు అంటే?
న్యూ ఓర్లీన్స్‌లో న్యూ ఇయర్‌ను విషాదంగా మార్చిన ఘోరమైన దాడి జరిగిన కొన్ని గంటల్లోనే 15 మందిని కిల్లర్ ట్రక్కుతో కొట్టి చంపారు. ఇందులో నిందితుడిని టెక్సాస్‌కు చెందిన 42 ఏళ్ల షంసుద్ దిన్ జబ్బార్‌గా FBI గుర్తించింది. నూతన సంవత్సర వేడుకలలో ఈ జబ్బార్ పోలీసులపై కాల్పులు జరిపాడు. అదే సమయంలో ఆయన కూడా మరణించాడు. అయితే ఈ భయంకరమైన దాడి సమయంలో అతని ట్రక్కులో ఐసిస్ జెండా ఉందని FBI ధృవీకరించింది.
ఇక ఈ జబ్బార్ ఒంటరిగా ఈ పనులు చేయకపోయి ఉండవచ్చు అని.. ఈ మారణహోమంలో అతడికి సహకరించిన వ్యక్తి ఎవరనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఈ జబ్బార్ టెక్సాస్ అనే వ్యక్తి టెక్సాస్‌లో పుట్టి పెరిగాడు. కిల్లర్ ట్రక్కులో టెక్సాస్ నంబర్ ప్లేట్ కూడా ఉంది. “వాహనంలో ఒక ISIS జెండా ఉంది. అంటే ఈయనకు ఉగ్రవాద సంస్థలతో అనుబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఆయుధాలు, సంభావ్య IED విషయం వాహనంలో ఉండటంతో ఈ అనుమానం మరింత పెరిగింది. ఇతర సంభావ్య IEDలు కూడా ఫ్రెంచ్ క్వార్టర్‌లో ఉన్నాయట.
సామూహిక హత్యకు ఉపయోగించిన ట్రక్కు నవంబర్ 16న టెక్సాస్‌లోని ఈగిల్ పాస్ వద్ద దక్షిణ సరిహద్దును దాటి యుఎస్‌లోకి వెళ్లడాన్ని ట్రాక్ చేశారట. దీన్ని ఫాక్స్ న్యూస్ నివేదించింది. అయితే ఆ సమయంలో జబ్బార్ ట్రక్కును నడుపుతున్నాడా లేదా అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ వెల్లడి న్యూ ఓర్లీన్స్ దాడి చేసిన వ్యక్తి వలసదారు కాదా అనే ఊహాగానాలకు దారితీసింది. అయితే జబ్బార్ ఒక టెక్సాస్ వ్యక్తి అని — US పౌరుడు అని FBI ధృవీకరించింది. సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, న్యూ ఓర్లీన్స్ పోలీసు చీఫ్ అన్నే కిర్క్‌ప్యాట్రిక్ ఇది DUIకి సంబంధించిన సంఘటన కాదని అన్నారు. దాడి చేసిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా వీలైనంత ఎక్కువ మందిని చంపేశాడట.