https://oktelugu.com/

CTET Answer Key : CTET 2024 ఆన్సర్ కీ. ctet.nic.inలో విడుదల.. ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) డిసెంబర్ 2024 సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) సమాధాన కీని విడుదల చేసింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 3, 2025 / 03:00 AM IST

    CTET

    Follow us on

    CTET Answer Key : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) డిసెంబర్ 2024 సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) సమాధాన కీని విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు CTET అధికారిక వెబ్‌సైట్, ctet.nic.in ద్వారా ఆన్సర్స్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జవాబు కీతో పాటు రెస్పాన్స్ షీట్‌ను కూడా బోర్డు విడుదల చేసింది. అయితే అభ్యర్థులు నేరుగా ఈ లింక్‌ని అనుసరించి మీ డౌట్ లను క్లియర్ చేసుకోవచ్చు. దాని కోసం https://cbseit.in/cbse/2024/ctetkey3/ ను క్లిక్ చేయండి.

    పై లింక్ ను ఉపయోగించి మీరు CTET డిసెంబర్ 2024 జవాబు కీని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CTET 2024 ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు అభ్యర్థులు. ఏ అభ్యర్థి అయినా ఆన్సర్ కీలో ఏదైనా పొరపాటును గుర్తిస్తే, ప్రతి ప్రశ్నకు రూ. 1,000 నాన్-రిఫండబుల్ రుసుము చెల్లించి తమ అభ్యంతరాన్ని తెలియజేసే అవకాశాన్ని ఇచ్చారు.

    CTET ఆన్సర్ కీ 2024ని డౌన్‌లోడ్ చేయడం ఎలా:
    CTET అధికారిక వెబ్‌సైట్, ctet.nic.inకి వెళ్లండి.

    హోమ్ పేజీలో ‘CTET 2024 ఆన్సర్ కీ’ లింక్‌పై క్లిక్ చేయండి.
    మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ వంటి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.
    తాత్కాలిక సమాధానాల కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
    అవసరమైతే ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసి, అభ్యంతరాలు తెలిపే ప్రక్రియను పూర్తి చేయండి.
    అభ్యంతరం కోసం రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
    చెల్లింపు రసీదుని డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్తు సూచన కోసం దాన్ని సురక్షితంగా ఉంచండి.

    పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన మార్కులు:
    CTET పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థి కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ప్రభుత్వ, స్థానిక సంస్థ, ప్రభుత్వ సహాయం పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు నియామకం సమయంలో, అభ్యర్థులకు వారి సంబంధిత రిజర్వేషన్ కేటగిరీ (SC/ST, OBC, దివ్యాంగులు వంటివి) ప్రకారం రాయితీలు ఇస్తారు.

    CTET ఫలితం, CTET పరీక్షలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ..
    మెరిట్ లో ఉన్న అభ్యర్థులను అపాయింట్‌మెంట్‌కు అర్హులు అవుతారు. అయితే ఇది రిక్రూట్‌మెంట్ లేదా ఉపాధికి హామీ ఇవ్వదు అని గుర్తు పెట్టుకోండి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఇది అర్హత ప్రమాణాలలో ఒకటి మాత్రమే. మీరు చేసిన అభ్యంతరం సరైనది అయితే సమాధానాల కీలో తప్పుగా ఉంటే బోర్డు పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది. కచ్చితంగా మీ రుసుము తిరిగి చెల్లిస్తుంది కూడా.

    వాపసు ప్రక్రియ
    అభ్యంతరం అంగీకరిస్తే చెల్లింపు కోసం ఉపయోగించిన క్రెడిట్/డెబిట్ కార్డ్‌పై వాపసు ప్రాసెస్ చేస్తారు. కాబట్టి, చెల్లింపు కోసం అభ్యర్థులు తమ వ్యక్తిగత క్రెడిట్/డెబిట్ కార్డులను ఉపయోగించాలని సూచించారు అధికారులు. బోర్డు నిర్ణయమే అంతిమంగా ఉంటుందని, అభ్యంతరాలపై తదుపరి చర్చ జరగదు అన్నారు.