https://oktelugu.com/

ఏపీలో నూతన మద్యం ధరలు ఇవే..!

రాష్ట్రంలో ధరల పంపు వివరాలను ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మద్యం క్వాటర్, హాఫ్, ఫుల్ బాటిళ్ల పై ఎంత ధరలు పెంచింది ఆ శాఖ తెలియజేసింది. రూ.120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ. 20 పెరుగుదల ఉంటుంది. హాఫ్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ పై రూ.80 పెంపు వర్తిస్తోంది. రూ.120-150 ధర ఉన్న క్వార్టర్ బాటిళ్ల ధర రూ.40, హాఫ్ బాటిల్ పై రూ.80, ఫుల్ బాటిల్ పై రూ.120 […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 4, 2020 / 09:55 AM IST
    Follow us on


    రాష్ట్రంలో ధరల పంపు వివరాలను ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మద్యం క్వాటర్, హాఫ్, ఫుల్ బాటిళ్ల పై ఎంత ధరలు పెంచింది ఆ శాఖ తెలియజేసింది. రూ.120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ. 20 పెరుగుదల ఉంటుంది. హాఫ్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ పై రూ.80 పెంపు వర్తిస్తోంది. రూ.120-150 ధర ఉన్న క్వార్టర్ బాటిళ్ల ధర రూ.40, హాఫ్ బాటిల్ పై రూ.80, ఫుల్ బాటిల్ పై రూ.120 పెంపు ఉంటుంది. రూ.150 కి పైగా ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ.60 పెంపు, హాఫ్ బాటిల్ పై రూ.120, ఫుల్ బాటిల్ రూ.240 పెంపు వర్తిస్తుంది. మినీ బీర్ పై రూ.20 , ఫుల్ బీర్ రూ.30కి పెంపు ఉంటుంది

    విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?

    మరోవైపు రాష్ట్రంలో మద్యం షాపులో సోమవారం ఉదయం నుండి తెరుస్తామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ తెలిపారు. ఉదయం 11 నుండి రాత్రి 7 వరకు మద్యం దుకాణాలు పని చేస్తాయన్నారు. మద్యం అమ్మకాల పై మార్గదర్శకాలు జిల్లా కలెక్టర్ లకు పంపినట్లు తెలిపారు. భౌతికదూరం పాటించాలన్నారు. షాపులో కి కేవలము 5 మందిని మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. షాపుల ముందు సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మాస్క్ లేనిదే మద్యం దుకాణాలకు అనుమతించమన్నారు. రద్దీ మరీ ఎక్కువ గా ఉంటే ఆ షాపులు కొంత సమయం మూసివేయక తప్పదన్నారు. బార్ లు ఎట్టిపరిస్థతుల్లోనూ ఓపెన్ చేయమన్నారు. కంటోన్మెంట్ జోన్ బయట మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఉందన్నారు. మద్యం అమ్మకాలు తగ్గించేందుకు ధరలు పెంచుతున్నట్లు వెల్లడించారు. మాస్క్ లేక పోతే క్యూ లైన్ లో కూడా ఉండనివ్వమని స్పష్టం చేశారు.