https://oktelugu.com/

నితిన్ భారీ చిత్రం 2 భాగాలుగా

‘భీష్మ’ సినిమా తో అనూహ్య విజయాన్ని అందుకొన్న నితిన్ తన తరవాతి ప్రాజెక్టుల విషయం లో చాలా కేర్ తీసుకొంటున్నాడు. ప్రస్తుతం నితిన్ సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దె’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో `క్రాష్ ‘ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. లాక్ డౌన్ లేకపోతే ఈ రెండు సినిమాలు దాదాపు పూర్తయ్యేవి . విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా? ఈ రెండు […]

Written By: , Updated On : May 4, 2020 / 10:03 AM IST
Follow us on


‘భీష్మ’ సినిమా తో అనూహ్య విజయాన్ని అందుకొన్న నితిన్ తన తరవాతి ప్రాజెక్టుల విషయం లో చాలా కేర్ తీసుకొంటున్నాడు. ప్రస్తుతం నితిన్ సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దె’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో `క్రాష్ ‘ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. లాక్ డౌన్ లేకపోతే ఈ రెండు సినిమాలు దాదాపు పూర్తయ్యేవి .

విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?

ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక మరో రెండు చిత్రాలను కూడా నితిన్ లైన్లో పెట్టడం జరిగింది . అందులో ఒకటి హిందీ చిత్రం ‘అంధాదున్’ రీమేక్. కాగా. ఈ చిత్రాన్ని ` వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ ` ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం చేయనున్నాడు.

ఇక రెండో చిత్రం నితిన్ కెరీర్లోనే భారీ చిత్రం గా రూపొందనుంది. కాగా ఈ చిత్రానికి “పవర్ పేట” అనే టైటిల్ పెట్టడం జరిగింది. గతంలో నితిన్ తో ‘చల్ మోహన్ రంగ’ సినిమా తీసిన `కృష్ణ చైతన్య` దర్శకత్వంలో రూపొందే ఈ యాక్షన్ డ్రామాని నితిన్ సొంత సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’,మరియు ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

కలవరపెడుతున్న చార్మినార్ జోన్!

కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుండటం విశేషం. ` పవర్ పేట ‘ అనే ఏరియా లో చెలరేగిన రౌడీయిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందట. కీర్తి సురేష్ కథానాయికగా ఎన్నిక అయిన ఈ చిత్రం లో రావు రమేష్ , సత్యదేవ్ కీలక పాత్రలు చేయనున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించే ఈ ‘పవర్ పేట’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది .