Indian Railways: భారతీయ రైల్వే మరో అద్భుతం చేసింది. ఇప్పటికే ప్రమాదాల నివారణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. రైల్వేకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రైల్వే ట్రాక్‌లను పెంచుతుంది. కొత్త రైల్వే మార్గాలు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో రైల్వే ఇంజనీరింగ్ వ్యవస్థ మరో అద్భుతం చేసింది.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మరో ట్రైన్‌తో పక్కపక్క ట్రాక్‌లపై ఆగకుండా, వేగంగా పయనిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఎక్స్‌ప్రెస్ లేదా వీఐపీ ట్రైన్లు వస్తే ఇతర ట్రైన్లను స్టేషన్ వద్ద నిలిపేసేవారు. ఇప్పుడు రెండు ట్రైన్లు స్వేచ్ఛగా, సురక్షితంగా వెళ్తున్నాయి. నెటిజన్లు దీన్ని “నయా భారత్.. పాత రోజులు పోయాయ్!” అంటూ ప్రశంసిస్తున్నారు. బీజేపీ కూడా ఈ వీడియోను ట్వీట్ చేసింది.
వీడియో వైరల్..
వీడియోలో వందే భారత్ ట్రైన్ మరో సాధారణ ట్రైన్‌తో పక్కపక్కనే ట్రాక్‌పై దూసుకెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. రెండు ట్రైన్లు ఆగకుండా, ఒకదాని వేగాన్ని మరొకటి అడ్డుకోకుండా వెళ్తున్నాయి. దీన్ని చూసిన వారు “ఇది ఇంజనీరింగ్ మార్వెల్”, “పాత రోజులు పోయాయి”, “మోడర్న్ టెక్ సిగ్నలింగ్‌కు థాంక్స్” అని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో రైల్వే అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
కొత్త యుగం ఆరంభం..
గతంలో భారతీయ రైల్వేల్లో మాన్యువల్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉండేది. ఎక్స్‌ప్రెస్ లేదా ముఖ్యమైన ట్రైన్లు రాగా, ఇతర ట్రైన్లను స్టేషన్ వద్ద ఆపేవారు. ఇది సేఫ్టీ కారణాలు, ప్రయారిటీ ఇవ్వడం, ట్రాక్ సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల జరిగేది. ఫలితంగా ప్రయాణ సమయం పెరిగేది, ట్రైన్ల సామర్థ్యం పూర్తిగా వినియోగం కాకుండా పోయేది. ఇప్పుడు పరిస్థితి మారింది. డబుల్ ట్రాకింగ్, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్, కేంద్రీకృత ట్రాఫిక్ కంట్రోల్ వంటి ఆధునిక సాంకేతికతలు వచ్చాయి. ఇవి ట్రైన్లను ఒకదానితో ఒకటి సురక్షితంగా, సమన్వయంగా నడపడానికి వీలు కల్పిస్తున్నాయి. రెండు ట్రైన్లు పక్కపక్క ట్రాక్‌లపై ఆగకుండా వెళ్లడం ఇప్పుడు సాధారణం అవుతోంది.
మోడర్న్ సిగ్నలింగ్ వ్యవస్థ..
ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ రైల్వేల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ట్రైన్ల మధ్య దూరం తగ్గించి, ఎక్కువ ట్రైన్లను నడపవచ్చు. మానవ తప్పిదాలు తగ్గుతాయి. వేగం పెరుగుతుంది, సమయం ఆదా అవుతుంది. సేఫ్టీ స్థాయి పెరుగుతుంది. వందే భారత్ వంటి సెమీ హై-స్పీడ్ ట్రైన్లు ఈ వ్యవస్థతో మరింత సమర్థవంతంగా నడుస్తున్నాయి. రైల్వేల్లో జరుగుతున్న సాంకేతిక విప్లవానికి ఇది మరో చిహ్నం.
భారతీయ రైల్వేల అభివృద్ధి..
గత కొన్నేళ్లలో రైల్వేలు డబుల్ ట్రాకింగ్, ఎలక్ట్రిఫికేషన్, కొత్త ట్రైన్లు, స్టేషన్ల ఆధునీకరణ వంటి అనేక మార్పులు చేశాయి. ఫలితంగా ప్రయాణ సమయం తగ్గింది. ట్రైన్ల సంఖ్య పెరిగింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. తాజాగా రెండు ట్రైన్లు ఆగకుండా వెళ్లడం రైల్వేల సామర్థ్యం, సేఫ్టీ, సాంకేతికత మూడూ మెరుగుపడ్డాయని అర్థం.
ఈ వైరల్ వీడియో భారతదేశం ఆధునికీకరణ వైపు అడుగేస్తున్నట్లు చూపిస్తోంది. మోడర్న్ టెక్నాలజీ, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ప్రజల జీవితాలు సులభతరం అవుతున్నాయి. ఇంకా మెరుగైన సిగ్నలింగ్ వ్యవస్థలు, హై-స్పీడ్ రూట్లు, మరిన్ని వందే భారత్ ట్రైన్లు వస్తే రైల్వేలు మరింత వేగవంతం, సురక్షితం అవుతాయి.
