Pawan Kalyan: జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతోంది. ప్రజా సమస్యలపై పవన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. ప్రజా సమస్యల పరిష్కారమే తన అభిమతమని చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో తాను పోటీచేయకుండా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. కానీ నిరూత్సాహపడలేదు. ప్రజల బాటను వీడలేదు. రోజురోజుకూ ఆయన ప్రజాభిమానం పెంచుకుంటున్నారు. అటు అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు. పవన్ ను ఒక దేవుడిలా కొలుస్తుంటారు. జనసేన ఫక్తు రాజకీయ పార్టీగా అవతరించుకున్నా.. అధినేత ఇచ్చే టాస్కును మాత్రం జనసైనికులు పూర్తిచేస్తుంటారు. తమ జేబు నుంచే ప్రజాసేవకు ఖర్చు చేస్తుంటారు. ఇటీవల సామాజిక సేవతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై జన సైనికులు గట్టిగానే పోరాడుతున్నారు.

యాంటీ ఫ్యాన్స్ పనే...
పవన్ కు వీరాభిమయానులు ఉన్నట్టే.. యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆయనకువ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ట్రోల్ చేస్తుంటారు. హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటారు. తాజాగా యాంటీ ఫ్యాన్స్ కొత్త కామెంట్లు పెడుతున్నారు. పవన్ రెండింటికి చెడ్డ రేవడి అంటూ.. అటు రాజకీయాలు, ఇటు సినిమాలో ఫెయిలవుతున్నారంటూ అర్ధం వచ్చేలా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏడాదికి రూ.100 కోట్లు సంపాదించే క్రేజీ ఉన్న హీరో రాజకీయాలంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అటు రాజకీయాల్లోకూడా సక్సెస్ కాలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. చివరకు ఆయన వస్త్రధారణపై కూడా మంత్రులు వ్యంగ్యోక్తులు సంధిస్తున్నారు.
కౌంటర్ ఇస్తున్న అభిమానులు..
అయితే యాంటీ ఫ్యాన్స్, ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని జన సైనికులు, అభిమానులు తిప్పికొడుతున్నారు. పవన్ కు పవర్, డబ్బుపై ఎప్పుడు ఆశలేదని చెబుతున్నారు. మీరు చెప్పినట్టుగా 100 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశమున్నా.. కేవలం ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేస్తున్నారు. అటు రాజకీయ పార్టీని ఏర్పాటుచేసి దండిగా డబ్బులు సంపాదించే అవకాశమున్నా.. ఆ మార్గాన్ని ఎంచుకోలేదని చెబుతున్నారు. అదే సమయంలో పవర్ దక్కించుకోవాలన్న తాపత్రయం ఆయనకు లేదన్నారు. సంపాదన విషయానికి వస్తే ఆయన ఏడాదికి ఒక సినిమా చేసుకుంటే చాలని.. టార్గెట్ కు చేరుకుంటారని నమ్మకంగా చెబుతున్నారు. ఆక్రోషంతో కామెంట్లు పెట్దవద్దని యాంటీ ఫ్యాన్స్ కు పవన్ అభిమానులు బుద్ధి చెబుతున్నారు.

ఇటువంటివి ఎవరైనా చేయగలరా?
ఉద్దానం కిడ్నీ బాధితుల నుంచి మత్స్యకారుల వరకూ… అమరావతి రైతుల నుంచి కౌలు రైతు కుటుంబాల వరకూ అన్నివర్గాల వారికి అండగా నిలిచింది పవన్ మాత్రమేనని అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటానికి సంఘీభావం తెలిపిన తొలి రాజకీయ నేత పవన్ అన్న విషయం గుర్తించుకోవాలంటున్నారు. అప్పులతో అఘాయిత్యాలు చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు కోట్లాది రూపాయల తన సొంత డబ్బును పంచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ నాడు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా.. పవన్ ఇచ్చే స్టేట్ మెంట్ కు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆ ఒక్కటి చాలు పవన్ నిజాయితీని తెలియజేస్తుందన్నారు. మరోసారి పవన్ పై తప్పుడు ప్రచారం చేస్తేతామే బుద్ధి చెబుతామని అభిమానులు గట్టిగానే రియాక్టవుతున్నారు.