కరోనాకు తోడు.. కొత్త వైరస్ భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే బ్రిటన్.. దక్షిణాఫ్రికా దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వివరాలను సేకరించి వారికి క్వారంటైన్ చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలను కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్టియన్లు జరుపుకుంటున్నాయి. బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన కొందరికీ కరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.
దీనిలో భాగంగానే న్యూయర్ వేడుకలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా న్యూయర్ సంబరాలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయర్ వేడుకల్లో పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ఎలాంటి అనుమతి లేదని సీపీ తేల్చిచెప్పారు.
కొత్త కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. పబ్బులు.. క్లబ్బులు.. బార్లకు అనుమతి లేదని చెప్పారు. అయితే స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని తెలిపారు.
రిసార్ట్ పబ్బులపై నిఘా ఉంటుందని.. తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు. నగరంలోని పబ్బులు.. క్లబ్బులకు అనుమతి లేదని ఎవరైనా హద్దు మీరితే చర్యలు తప్పవన్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని.. నిబంధనలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రేటర్ కమిటీలోనూ న్యూయర్ వేడుకలపై నిషేధం ఉంటుందని తెలిపారు.
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.