Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అక్కడ అధికార పార్టీకి విజయ్(TVK vijay) ఆధ్వర్యంలోని టీవీకే చుక్కలు చూపిస్తోంది. తాజాగా టీవీకే పార్టీ తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలో చోటు చేసుకున్న కుంభకోణాన్ని బయటపెట్టింది. ఇది ఆ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగం(Tamil Nadu municipal administration and water supply department)లో చోటుచేసుకుందని టీవీకే ఆరోపించింది.
Also Read: చిరంజీవి తో కలిసి నటించడం పై ప్రభాస్ హీరోయిన్ హాట్ కామెంట్స్..మండిపడుతున్న ఫ్యాన్స్!
టీవీకే ఆరోపణల ప్రకారం చూసుకుంటే.. తమిళనాడు రాష్ట్రంలోని మునిసిపల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగంలో ఉద్యోగాల భర్తీ నిర్వహించారు. ఈ క్రమంలో ఒక్క ఉద్యోగానికి 25 నుంచి 35 లక్షల వరకు లంచాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ మనీలాండరింగ్ కేసు కు సంబంధించిన వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (enforcement directorate) సోదాలు నిర్వహించింది. తద్వారా ఈ కుంభకోణం (cash – for – job – scam) వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై తమిళనాడు పోలీస్ శాఖకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసినట్టు తెలుస్తోంది.
ఈ ముడుపుల వ్యవహారంలో బలమైన వ్యక్తులు ఉన్నారని ఈడీ అధికారులు అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగంలో ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి 2024 లో రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ ఉద్యోగాలకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 1.12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు నిర్వహించిన తమిళనాడు ప్రభుత్వం 2,538 ని ఎంపిక చేసింది. వీరికి గత ఏడాదిలో ముఖ్యమంత్రి స్టాలిన్ నియామక పత్రాలు అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.
ముఖ్యంగా 150 మంది అభ్యర్థులకు ప్రయోజనం కలిగించే విధంగా పరీక్షలలో అక్రమాలకు పాల్పడినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాలలో వెల్లడించింది. ఈ 150 మంది అభ్యర్థుల నుంచి 25 నుంచి 35 లక్షల చొప్పున డబ్బులు తీసుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ వ్యవహారం వెనుక అనేక మంది రాజకీయ నాయకులు.. ఇంకా కొన్ని సంస్థలు ఉన్నట్టు ఈడి ఆరోపించింది. ఈ వ్యవహారం పై దర్యాప్తు జరపాలని తమిళనాడు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ కు ఈడి లేఖ రాయడం కలకలం కలిగిస్తోంది. ఈ అక్రమాలకు సంబంధించి 232 పేజీలతో ఆధారాలు కూడా. ఈ పరీక్షను అన్నా యూనివర్సిటీ నిర్వహించింది. ఆ విశ్వవిద్యాలయంపై కూడా దర్యాప్తు చేపట్టాలని ఈడీ కోరినట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారాన్ని తమిళనాడు మీడియా పట్టించుకోకపోయినప్పటికీ.. టీవీకే పార్టీ అధినేత ప్రధానంగా దృష్టి సారించారు. ఇటీవల కరూర్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో విజయ్ ని అధికార డిఎంకె టార్గెట్ చేసింది. అనుకూల మీడియాలో అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేయించింది. అయితే అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్న విజయ్.. అదును చూసి డీఎంకేను దెబ్బ కొట్టారు.. అంతేకాదు తమిళనాడు రాష్ట్రంలో ఉద్యమాలు నిర్వహించడానికి కసరత్తులు కూడా చేస్తున్నారు.