Dude OTT Release Date: తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన ‘డ్యూడ్'(Dude Movie) చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తోంది. ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్ కాకపోయినా, వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 88 శాతం కి పైగా రీకవరీ ని సాధించింది. పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు మాత్రం ప్రస్తుతానికి కనిపించడం లేదు. తెలుగు లో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ వీకెండ్ తో అందుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. ఎందుకంటే గతం లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ప్రదీప్ సినిమాలు లవ్ టుడే, డ్రాగన్ కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. భారీ లాభాలను తెచ్చిపెట్టాయి ఈ రెండు సినిమాలు. అందుకే ‘డ్యూడ్’ కూడా మంచి రేట్ కి అమ్ముడుపోయింది.
Also Read: చిరంజీవి తో కలిసి నటించడం పై ప్రభాస్ హీరోయిన్ హాట్ కామెంట్స్..మండిపడుతున్న ఫ్యాన్స్!
అయితే ఈ సినిమా కూడా నాలుగు వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల చెయ్యాలి అని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం చూస్తే ఈ సినిమా నవంబర్ 14 న తెలుగు, తమిళం తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. మొదటి రెండు సినిమాలు లాగానే ఈ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థియేటర్స్ లో అనుకున్నంత రేంజ్ కి చేరుకోలేకపోవడానికి ముఖ్య కారణం సెన్సిటివ్ సబ్జెక్టు అవ్వడం వల్లే. కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ ని మాత్రమే ఆకట్టుకుంది ఈ చిత్రం. కానీ ఏది ఏమైనా ప్రదీప్ రంగనాథన్ ఎంచుకుంటున్న స్టోరీ సెలక్షన్ కి మాత్రం మెచ్చుకోకుండా ఉండలేము. ఇదే తరహా లో ఆయన తన కెరీర్ ని కొనసాగిస్తే మాత్రం, రాబోయే రోజుల్లో తమిళనాడు లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా అవతరించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ లో ఆయన హీరో గా నటించిన మరో చిత్రం ‘LIK’ విడుదల కాబోతుంది. ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది కూడా హిట్ అయితే ఇక ప్రదీప్ రంగనాథన్ జోరుని ఎవ్వరూ అందుకోలేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు.