బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విటర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన సందర్భంగా విజయశాంతి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విటర్ వేదికగా మరోసారి గళం విప్పారు. అయితే నెటిజన్లు మాత్రం విజయశాంతి ట్విటర్ నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. తెర వెనుక రాజకీయం చేస్తే సరిపోదని ప్రజల్లోకి వెళ్లి నేరుగా పాల్గొంటేనే మంచి ఫలితాలు ఉంటాయని వారి ప్రగాఢ విశ్వాసం.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయని ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసింది. దీంతో ప్రజలు మళ్లీ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనా మూడో దశ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని పేర్కొన్నారు. లాక్ డౌన్ ఎత్తివేయడంతో సీఎం జిల్లాల పర్యటన చేస్తూ ప్రజలను కలుస్తున్నారు. సామూహిక భోజనాలు కూడా చేస్తున్నారు.
దీంతో కరోనా ముప్పు గురించి పట్టించుకోవడం లేదు. మహారాష్ర్ట, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలు కొవిడ్ డెల్టా వేరియంట్ కు భయపడుతున్నాయి. కానీ తెలంగాణ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పెట్టేందుకు సిద్ధపడుతోంది. నెటిజన్ల నుంచి విజయశాంతి వ్యాఖ్యలకు మిశ్రమ స్పందన వస్తోంది. ట్విటర్ నుంచి బయటకు వచ్చి నిజమైన పోరాటాలు చేయాలని సూచిస్తున్నారు. గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ లాంటి వారే బీజేపీలో చేరి ర్యాలీలు చేస్తున్నారని ప్రశ్నించారు.
ట్విటర్ వెనకాల దాక్కుని రాజకీయాలు చేసినంత కాలం ఏ రాజకీయ నాయకుడికి కూడా పెద్దగా ఒరిగేమీ ఉండదు. విజయశాంతి కూడా దీనికి మినహాయింపు కాదు. గతంలో నారా లోకేష్, వపన్ కల్యాణ్ వంటి విషయంలో కూడా ఇదే తరహా విమర్శలు వచ్చినప్పటికి ఆ తర్వాత వారు కొంత వరకు ఆ ముద్రను చెరిపోసుకోగలిగారు. విజయశాంతి భవిష్యత్తులో అయినా ప్రజా పోరాటాలు చేసి లేడీ సూపర్ స్టార్ అనిపించుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Netizens who want vijayashanti to come out beyond twitter
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com