
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ వివేకానంద హత్య కేసు మిస్టరీగానే మారుతోంది. సాక్షాత్తూ ఏపీ సీఎం చిన్నాన్న అయిన వివేకానంద హత్య కేసు ఇంకా కొలిక్కి రాకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇండియాలో అత్యన్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఈ కేసు టేకాఫ్ చేసినా ఇంకా విచారణ దశలోనే ఉండడంపై అసలు ఈ కేసు ఎటు వెళ్తుందోనన్న చర్చ సాగుతోంది. అంతకుముందు వివేకానంద కూతురు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు, సీబీఐ పని తీరుకు అద్దం పడుతోందని అంటున్నారు.
వివేకానంద కేసు విచారణను ప్రారంభించిన సీబీఐ అధికారులు ఆయనకు సంబంధించి పనివాళ్లు, డ్రైవర్లను ప్రశ్నించారు. ఆ తరువాత ఆయన పొలం పనులు చూసే వారిని కూడా విచారించారు. అయితే అంతకు మించి సీబీఐ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. గతంలో వివేకా కుమార్తె ఢిల్లీలో సీబీఐ అధికారుల తీరును తప్పు పడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. సీబీఐ అధికారులు ఈ కేసును చాలా లైట్ గా తీసుకుంటున్నారన్నారు. అంతేకాకుండా కడపలో ఇవన్నీ మాములే అన్నట్లుగా విచారణ జరుపుతున్నారన్నారు.
ఆమె ఆరోపణలతో కేసు ముందుకు సాగే అవకాశం ఉందని అందరూ భావించారు.కానీ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఎటూ తేల్చలేకపోతున్నారు. వాస్తవానికి ఇలాంటి కేసును అధికారులు తలుచుకుంటే వారానికి మించి సమయం పట్టదు. కానీ ఇలా ఎందుకు తాత్సారం జరుగుతుందో తెలియడం లేదని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఇలా విచారణ పేరిట కాలం గడిపితే రాను రాను సీబీఐ పై కూడా నమ్మకం సన్నగిల్లే ప్రమాం ఉందని కొందరు వాదిస్తున్నారు. మరి ఇప్పటికైనా బాబాయ్ కేసు లో కొలిక్కి వస్తుందా.? లేదా.? చూడాలి..