https://oktelugu.com/

Chandrababu: బాబు గారి కూరగాయల హామీలు.. నవ్వకండహే.. వైరల్ వీడియో

తెలుగు నాట నారా చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయ నాయకుడు.పలు మార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. తెలుగు రాష్ట్రాలకు ఐటీని నేనే పరిచయం చేశానని ఆయన చెప్పుకుంటారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 30, 2023 / 01:00 PM IST

    Chandrababu

    Follow us on

    Chandrababu: రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే. ఆ అధికారం కోసం రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇస్తుంటాయి. ఎన్నో ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తుంటాయి. ఖజానా వట్టిపోతున్నా.. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెస్తున్నా.. అడ్డగోలుగా పన్నులు పెంచుతున్నా.. రాజకీయ పార్టీలకు పట్టదు. ఎందుకంటే వాటికి కావాల్సింది అధికారం మాత్రమే.. ఇక ఇలాంటి రాజకీయ పార్టీలు అధికారం దూరమైతే తట్టుకోలేవు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీలకు జనం సమస్యలు పట్టవు. అధికారం దూరమైతే ఆ రాజకీయ పార్టీలకు నిద్ర పట్టదు.. ఈ రాజకీయ పార్టీలను నడిపేది రాజకీయ నాయకులే కాబట్టి.. వారి ఆలోచన విధానాన్ని ఆ రాజకీయ పార్టీలు అమలు చేస్తుంటాయి. అయితే ఆ విధానాలు ఒక సవ్య దిశలో ఉంటే బాగానే ఉంటుంది. అధికారం కోసం అడ్డదిడ్డంగా ఇస్తేనే అసలు సమస్య మొదలవుతుంది. అప్పటికే జనంలోకి వెళ్లి అది చేయాల్సిన నష్టం చేకూర్చుతుంది.

    తెలుగు నాట నారా చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయ నాయకుడు.పలు మార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. తెలుగు రాష్ట్రాలకు ఐటీని నేనే పరిచయం చేశానని ఆయన చెప్పుకుంటారు. బ్రిటిష్ వాళ్ళ మెడలు గురించి కూడా తానే అని గొప్పలు పోతారు. అలాంటి నాయకుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా పని చేస్తున్నారు. మొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో కొద్దిరోజులపాటు శిక్ష అనుభవించి వచ్చారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. కొద్దిరోజులపాటు వ్యూహాత్మకంగా మౌనం పాటించి ఆ తర్వాత తన రాజకీయ చతురతకు పదును పెడుతున్నారు.. అయితే ఇలాంటి సమయంలో ఎంతో హుందాగా మాట్లాడాల్సిన చంద్రబాబు నాయుడు కట్టు తప్పుతున్నారు.. ఏవేవో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోల్ కు గురవుతున్నారు.

    చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉంటుంది. అయితే ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా చంద్రబాబు నాయుడు ని ఓడించాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అక్కడ ప్రభుత్వ పరంగా వివిధ రకాల అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు దీటుగా ఒక అభ్యర్థిని అక్కడ బరిలో నిలిపారు. ఆయన చేతుల మీదుగా వివిధ రకాల పనులు చేయిస్తున్నారు. అయితే తన సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన కొంతకాలం తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. సహజంగానే జగన్ పాలన విధానాల మీద విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించారు. ఇదే సమయంలో కుప్పం ప్రజల కోసం ఒక బలమైన హామీలు ఇచ్చారు. కుప్పం ప్రజల కోసం ఆకాశంలో ప్రత్యేక విమానాల ద్వారా కూరగాయలు తెస్తానని హామీ ఇచ్చారు.. ప్రజలు ఇంట్లో ఉంటే చాలు వారి బాగోగులు మొత్తం నేనే చూస్తానని హామీ ఇచ్చారు. అయితే ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి హామీలైనా ఇవ్వవచ్చు. కానీ ఆకాశంలో విమానాల ద్వారా కూరగాయలు తేవడం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అత్యయిక పరిస్థితి ఏర్పడినప్పుడే ఇలాంటి మార్గాల ద్వారా ప్రజలకు వివిధ సరుకులు చేరవేరుస్తారు. ఏపీలో అత్యయిక పరిస్థితి రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంటే ఏపీలో అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబుకు సంతోషం కలుగుతుందా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.