Social Trends: హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తున్నాయి. నెటిజన్లు తమ సృజనాత్మకతతో సినిమా డైలాగులను మేళవించి పంచులతో విరుచుకుపడుతున్నారు. తమదైన శైలితో కామెడీ పండిస్తున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ప్రకాష్ రాజ్ తన ఇద్దరు కుమారులు వెంకటేశ్, మహేష్ బాబులతో ఓ పెళ్లిలో చేసే హితబోధ డైలాగ్ సీన్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానికి పేరడిగా ‘హుజూరాబాద్ ఉపఎన్నికలపై’ మాట్లాడితే ఎలా ఉంటుందో ఓ నెటిజన్ ఆసక్తికరంగా మార్చాడు. ఆ పేరడీని మీరూ చదివి ఎంజాయ్ చేయండి..
ఎంత కంగారు పడిపోయారు రా ఓటర్లు పాపం
ఒక్క ఉప ఎన్నికతో అల్లకల్లోలం అయిపోయింది..
ఏదైనా భలే పోటీ చేస్తున్నారు రా.. భలే ప్రచారం చేస్తున్నారు రా..
అలా ఉండాలి.. అది ఉంటే చాల్రా ఆ తర్వాతే ఏదైనా..
అదిగో చూడు.. అందులో డబ్బున్నోడు ఉన్నాడు.. ధైర్యవంతుడు ఉన్నాడు.. పిరికోడు ఉన్నాడు.. ప్రతీవోడి ఆలాపన ఒక్కటే..
దేవుడా నేను మంచోడిని నన్ను గెలిపించు.. దేవుడా నేను మంచోడిని నన్ను గెలిపించు..
అయన్ని చూసి నటన అనుకుంటామే.. అయి నటనలేహె
ఓటర్లు మంచోళ్లు రా.. ఓటరు అంటనే మంచోడు..
ఏమిచ్చానురా నేను మీకు.. ఓటర్లను ఇచ్చానా.. పార్టీలు ఇచ్చానా.. ఉప ఎన్నిక ఇచ్చాను పోరాండిరా అని..
ఒక సామాన్యుడిగా ఏమివ్వగలం రా మనం ఈ సమాజానికి
ఉప ఎన్నికతో కూడిన అసెంబ్లీ సీటు తప్ప
దానికి మించింది ఏదైనా ఉందేట్రా
ఇదిగో ఈ ఉప ఎన్నికకే నీది ఈ పార్టీ.. వాడిది ఆ పార్టీ.. ఈ ఉప ఎన్నికకే మీ పార్టీ నాయకుడిని
ఉప ఎన్నికల వరకు ఎందుకురా.. మళ్లీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తామో లేదో.. మనకే తెలియదు
అందుకే ప్రతీ ఓటరుని చిరునవ్వుతో పలుకరిస్తూ వెళ్లిపోతే చాలు..
ఆ ఓటరును ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా..
అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడి ఓటరు గురించి కోరుకోవాలి..
భగవంతుడా నిజాయితీగా ఓటేసే ఏ ఒక్కరిని చిరునవ్వుకు దూరం చేయకు.. అంతే..
-మహేష్ గుర్రాల