Homeఆంధ్రప్రదేశ్‌ఏపీ అంటే ఎందుకంత చులకనా..?

ఏపీ అంటే ఎందుకంత చులకనా..?

AP
మనల్ని సాధారణంగా పక్కింటి వారు చిన్న మాట అంటేనే భరించలేకపోతం. అదే స్థాయిలో స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇస్తుంటాం. మరోసారి మన జోలికి రాకుండా రిప్లై ఇస్తుంటాం. కానీ.. ఇప్పుడు ఆంధ్రను అందరూ అవమానిస్తుంటే ఎవరూ ఏమనలేని పరిస్థితి ఉంది. పొరుగు రాష్ట్రాల వాళ్లు.. తమ ప్రజల్ని మెప్పించడానికి ఆంధ్రను ఉదాహరణగా చూపి అవమానిస్తున్నారు. కానీ.. ఎలాంటి ప్రతిస్పందన మాత్రం కానరావడం లేదు. తెలంగాణ, తమిళనాడు ప్రముఖ నేతలే ఏపీ గురించి.. ఏపీ నేతల గురించి అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ.. మాటలు పడుతున్నవారు స్పందించడం లేదు.

ఏపీని తక్కువ చేసి చూపడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఎప్పుడూ ముందుంటారు. గత ప్రభుత్వంలో ఆయన ఏమైనా అంటే.. గట్టిగా రివర్స్ ఎటాక్ వచ్చేది. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అలాంటి రివర్స్‌ ఎటాక్‌లు ఎక్కడా కనిపించడం లేదు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే ఏపీలో భూముల విలువ దారుణంగా పడిపోయింది.. తెలంగాణ భూముల విలువ ఎక్కడికో పోయిందని ప్రకటించేశారు. అంతకుముందు ఓ సారి ఏపీ అధఃపాతాళానికి పడిపోయిందని తేల్చారు. తాజాగా.. మంత్రి హరీష్ రావు కూడా అంత కంటే దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో యాసంగి సీజన్‌లో 22 లక్షల ఎకరాల వరి పంట మాత్రమే పండిస్తున్నారని.. తెలంగాణలో 53 లక్షల ఎకరాల్లో పంట వేశారని.. ఆంధ్రోళ్లే ఒకప్పుడు తెలంగాణ వారికి వ్యవసాయం రాదని ఎగతాళి చేశారని వ్యాఖ్యానించారు.

అయితే.. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నం. ఆంధ్రోళ్లకు వ్యవసాయం రాదన్నట్లుగా హరీష్ రావు మాటలు మాట్లాడుతున్నారు. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో మూడింతలు భూమి ధరలు పెరిగాయని.. ఆంధ్ర వెనుకబడిపోయిందన్నారు. ఇదంతా ఏపీ వెనుకబడిపోయిందని తాము ఎక్కడికో వెళ్లిపోయామని చెప్పుకునే తాపత్రయంలో భాగంగానే నడిచింది. మరోవైపు తమిళనాడులో ఎన్నికలు జరుగుతుంటే.. అక్కడి నేతలు కూడా తాము ఏపీ నేతల్లాంటి వాళ్లంకాదని ఉదాహరణలు చెబుతూ.. తమ హీరోయిజాన్ని ఎలివేట్ చేసుకుంటున్నారు. బీజేపీ నేతలు దర్యాప్తు సంస్థలతో భయపెడితే భయపడబోమని.. పొరుగు రాష్ట్రాల సీఎంల లాగా భయపడబోమని ఆయన ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏపీ , తెలంగాణ సీఎంలు కేసుల భయంతో బీజేపీని పల్లెత్తు మాట అనరన్న ప్రచారం తమిళనాడులో బాగా జరిగింది. ఈ క్రమంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చివరికి కమల్ హాసన్ కూడా.. తన పార్టీని కార్యకర్తల్ని ఇతర జెండాలకు తాకట్టు పెట్టబోనని.. పవన్ కల్యాణ్‌ను ఉదాహరణగా చూపించి అన్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

అటు కేసీఆర్ కించ పర్చినా.. ఇటు స్టాలిన్ ఎగతాళి చేసినా ఏపీ నుంచి మాత్రం ఎవరి నుంచీ స్పందన లేకుండా పోయింది. ఒక్కరంటే ఒక్కరూ ఖండించలేదు. ఫలితంగా ఏపీ అంటే ఇంకా ఇంకా అలుసైపోతోంది. పొరుగురాష్ట్రాల ప్రజల ముందు ఏపీకి కనీస గౌరవం దక్కడం గగనంగా మారింది. పాలకులు ఇతర అంశాల్లో ఎలా ఉన్నా రాష్ట్ర గౌరవాన్ని బయట కాపాడటం అత్యంత కీలకం. అదీ కూడా చేయకుండా.. కుల, మత రాజకీయాలు చేసుకుంటే స్వయం వినాశనమే తప్ప ప్రయోజనం ఉండదనేది పలువురి అభిప్రాయం. ఇప్పటికైనా వారి నుంచి ఏమైనా అటాక్‌ మొదలవుతుందో లేదో చూడాలి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version