https://oktelugu.com/

NCB Rydes : మైహోమ్ అవతార్ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్.. ఎన్సీబీ సోదాలతో కలకలం..

NCB Rydes : కాదేది డ్రగ్స్ కు అనర్హం అన్నట్టుగా మారింది. వాణిజ్య రాజధాని ముంబైనే కాదు.. మన భాగ్యనగరంలో కూడా డ్రగ్స్ మూలాలు బయటపడుతూనే ఉన్నాయి. అప్పట్లో టాలీవుడ్ లో ఈ డ్రగ్స్ మూలాలు కలకలం రేపాయి. ప్రముఖ హీరోలు, దర్శకులు ఈ కేసులో బయటపడడం దుమారం రేపింది. ఆ కేసు ముగిశాక కూడా హైదరాబాద్ పబ్ లలో డ్రగ్స్ బయటపడుతూనే ఉంది. ఇటీవల వరుసగా పబ్స్ లలో ఇది వెలుగుచూసింది. తాజాగా హైదరాబాద్ లో […]

Written By: , Updated On : November 2, 2022 / 06:26 PM IST
Follow us on

NCB Rydes : కాదేది డ్రగ్స్ కు అనర్హం అన్నట్టుగా మారింది. వాణిజ్య రాజధాని ముంబైనే కాదు.. మన భాగ్యనగరంలో కూడా డ్రగ్స్ మూలాలు బయటపడుతూనే ఉన్నాయి. అప్పట్లో టాలీవుడ్ లో ఈ డ్రగ్స్ మూలాలు కలకలం రేపాయి. ప్రముఖ హీరోలు, దర్శకులు ఈ కేసులో బయటపడడం దుమారం రేపింది. ఆ కేసు ముగిశాక కూడా హైదరాబాద్ పబ్ లలో డ్రగ్స్ బయటపడుతూనే ఉంది. ఇటీవల వరుసగా పబ్స్ లలో ఇది వెలుగుచూసింది.

తాజాగా హైదరాబాద్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ‘మైహోమ్స్’ నిర్మించిన అపార్ట్ మెంట్స్ లలో కూడా కొందరు డ్రగ్స్ కలిగి ఉన్నట్టు ఏకంగా జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ పసిగట్టింది. ఏకంగా హైదరాబాద్ వచ్చి మరీ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని నార్సింగిలోని మైహోమ్ అవతార్ అపార్ట్ మెంట్ లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

మైహోమ్ అవతార్ అపార్ట్ మెంట్లో అద్దెకు నివసిస్తున్న వ్యక్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారిస్తున్నారు. అయితే ఎవరినైనా అరెస్ట్ చేశారా? కీలక వ్యక్తులను పట్టుకున్నారా? మునుగోడు ఉప ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిన ఈ దాడి తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇందులో బిగ్ ఫిష్ లు ఉంటే మాత్రం ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది. పూర్తి సమాచారం బయటకు రాకపోవడంతో ఈ డ్రగ్స్ కేసు ఆసక్తి రేపుతోంది.