Allu Sirish: యంగ్ హీరో అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. నవంబర్ 4న వరల్డ్ వైడ్ ఈ మూవీ విడుదల అవుతుంది. విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా పాప్యులర్ టాక్ షో ఆలీతో సరదాగా కి అల్లు శిరీష్ వచ్చారు. ఎప్పటిలాగే హోస్ట్ అలీ గెస్ట్ శిరీష్ ని తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. శిరీష్ ఇంట్లో వాళ్లపై అలిగి ముంబై వెళ్లిపోయారని ఒక న్యూస్ అప్పట్లో వైరల్ అయ్యింది. ఆ విషయాన్ని అలీ పరోక్షంగా శిరీష్ ని అడిగారు. ఏంటి ఈ మధ్య ఎక్కువగా ముంబైలో ఉంటున్నావట? కోడలిని తెచ్చే ప్రాసెస్ ఏమైనా చేస్తున్నావా? అన్నాడు. దానికి శిరీష్ నవ్వేశాడు.

అను ఇమ్మానియేల్ తో శిరీష్ చేసిన లిప్ లాక్ సీన్ స్క్రీన్ పై వేసి దాని గురించి అడిగారు. ఈ జనరేషన్ కి అది పెద్ద విషయమే కాదు, మనలాంటి పెద్దోళ్ళు కొంచెం మాట్లాడుకుంటారని శిరీష్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఇండైరెక్ట్ గా అను ఇమ్మానియేల్ తో ఎఫైర్ గురించి కూడా అలీ టచ్ చేశాడు. అలాగే బిజినెస్ లో తండ్రి అల్లు అరవింద్ కి మించిన వాడివని తెల్సిందని అలీ అన్నారు. ఆయన నాకు అంత ఎలివేషన్ ఇచ్చినందుకు థాంక్స్ అని శిరీష్ స్పందించారు.
కాగా అలీ అల్లు అర్జున్ గురించి అడిగిన ఒక ప్రశ్న ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. చివరికి భార్య స్నేహారెడ్డితో కూడా చెప్పుకోలేని సీక్రెట్స్ బన్నీ నీతో చెప్తాడట? అవి ఏంటి? అని శిరీష్ ని అలీ అడిగాడు. అది నిజమేనని శిరీష్ ఒప్పుకున్నారు. అన్న అల్లు అర్జున్ చెప్పిన ఆ సీక్రెట్స్ వదిన గన్ను పెట్టి అడిగినా చెప్పలేనని శిరీష్ చెప్పాడు. అంతటి టాప్ సీక్రెట్స్ అల్లు అర్జున్ తమ్ముడికి ఏం చెప్పాడనే ఉత్సుకత నెలకొంది. ఇక ముంబైలో ఉండగా అక్కడి వాళ్ళు పుష్ప మూవీ గురించి మాట్లాడుకుంటుంటే విని గొప్పగా ఫీలయ్యేవాడినని అల్లు శిరీష్ తెలిపారు. తాజాగా విడుదలైన ఆలీ తో సరదాగా ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

పూర్తి ఎపిసోడ్ ప్రసారమైతే కానీ హోస్ట్ అలీ గెస్ట్ శిరీష్ నుండి రాబట్టిన అల్లు ఫ్యామిలీ సీక్రెట్స్ తెలియవు. ఇక అవుట్ అండ్ అవుట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాకేష్ శశి దర్శకత్వంలో ఉర్వశివో రాక్షసివో తెరకెక్కింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కించారు. వెన్నెల కిశోర్, సునీల్ కీలక రోల్స్ చేశారు. ఊర్వశివో రాక్షసివో చిత్రానికి అచ్చు సంగీతం అందించారు. ఒక్క హిట్టు కోసం వేచి చూస్తున్న శిరీష్ ఈ మూవీతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.