మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్సవిశాఖను ఒక సామాజికవర్గం వారు రెండో బెజవాడ అని పిలుచుకుంటుంటారు. వారంతా నాలుగు దశాబ్దాలుగా విశాఖలో సెటిల్ అయిపోయారు. ఆర్థికంగా, సామాజికంగా రాజకీయంగా విశాఖ సిటీని ఏలుతున్నారు. అందుకు సాక్ష్యం మూడు దశాబ్దాలుగా విశాఖ నగరంలో నాన్ లోకల్ ఎంపీ తప్ప లోకల్ ఊసే లేదు. ఇక పెట్టుబడులు పెట్టి గెలుస్తూ.. తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారు. ఒక విధంగా విశాఖ వారికి వ్యాపార రాజధాని, అటువంటి చోట పాలనారాజధానిగా వైసీపీ ప్రతిపాదించినా వారి డామినేటింగ్ రోల్‌ని తట్టుకోవడం కష్టం. అందుకే ఇప్పుడు విశాఖలో కొత్త వ్యూహాలు అమలుచేస్తున్నారు అంటున్నారు.
Also Read: చరిత్ర: దీపావళి.. టపాసులు.. ఎప్పుడు, ఎక్కడ పుట్టాయి?
విశాఖలో సెటిలర్స్ ఎక్కువ. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన తమ వ్యాపారాలు నడిపిస్తున్నారు. రాజకీయాల్లోనూ శాసిస్తున్నారు. అయితే.. విశాఖలో రేపటి రోజున మరో సామాజికవర్గం పెత్తనం కోసం అర్రులు చాచుకుని కూర్చుంది. ఇప్పటికే వారి ఆనవాళ్లు ఉన్నా మొదటి సామాజికవర్గం అంత బలంగా లేరు. పైగా విశాఖలో రాజకీయంగా వారికి పట్టు దొరకడంలేదు. దాంతో బలమైన మొదటి సామాజికవర్గానికి చుక్కలు చూపించి వచ్చిన దారే చూపిస్తేనే తమకు చోటు ఉంటుందని ఆశిస్తున్నారు. దాంతో వారి మీద గట్టి దెబ్బ పడుతోంది. మామూలుగానే భూ ఆక్రమణలు అంటే రాజకీయ నాయకునికి సహజమైన హక్కుగా చూస్తారు.
Also Read: తుంగభద్ర పుష్కరాలకు వెళ్లే వారికి అలర్ట్.. వాళ్లకు మాత్రమే అనుమతి..?
విశాఖలో ప్రధానంగా పుట్టి పెరిగిన వారికి రాజకీయంగా తమ సొంత ప్రాంతంలో బలం లేదు. ఆర్థికంగానూ లేరు. దీంతో అక్కడ నాన్ లోకల్ పాలిటిక్స్ రంజుగా సాగుతోంది. రెండు పార్టీలు, రెండు సామాజిక వర్గాల మధ్య పోరు విశాఖ మైదానం మారుతోందని అంటున్నారు పరిశీలకులు. ఏదిఏమైనా భవిష్యత్ రాజకీయాలు మాత్రం లోకల్ లీడర్లకు అనుకూలంగా మారబోతున్నాయా అనేది చూడాలి.