పవర్ స్టార్ పవన్ ప్యాకేజీ.. తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారాడు. వరుస సినిమాలను ప్రకటిస్తూ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. అయితే ఇప్పటివరకు పవన్ సినిమాల్లో ‘వకీల్ సాబ్’ మినహా మరో సినిమా పట్టాలెక్కలేదు. ‘వకీల్ సాబ్’ మూవీ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ పవర్ స్టార్ వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుండటంతో ఆయన తదుపరి సినిమాపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే పవన్ […]

Written By: NARESH, Updated On : November 1, 2020 11:02 am
Follow us on



పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారాడు. వరుస సినిమాలను ప్రకటిస్తూ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. అయితే ఇప్పటివరకు పవన్ సినిమాల్లో ‘వకీల్ సాబ్’ మినహా మరో సినిమా పట్టాలెక్కలేదు. ‘వకీల్ సాబ్’ మూవీ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

పవర్ స్టార్ వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుండటంతో ఆయన తదుపరి సినిమాపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ డైరెక్టర్ క్రిష్.. హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డితో సినిమాలను లైన్లో పెట్టారు. తాజాగా మలయాళంలో సూపర్ హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్ లో పవన్ నటించిందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Also Read: ఆర్ఆర్ఆర్ ‘జక్కన్న’ తీరులో మార్పు రాలేదుగా..!

‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ మూవీకి సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా కోసం నిర్మాతలు పవన్ కల్యాణ్ కు భారీ ప్యాకేజీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం 40రోజుల కాల్షీట్ల కోసం 30కోట్లు చెల్లించడంతోపాటు సినిమా లాభాల్లో 25శాతం వాటా ఇవ్వనున్నారట.దీంతో ‘వకీల్ సాబ్’ పూర్తయిన వెంటనే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ పట్టాలెక్కనుందనే టాక్ విన్పిస్తోంది.

Also Read: చరణ్ అప్పుడెప్పుడో కొట్టడం మొదలుపెట్టి ఇంకా ఆపలేదు

ఈ సినిమాలో మరో హీరో ఎవరనేది తేలాల్సి ఉంది. దుగ్గుపాటి రానా.. యంగ్ హీరో నితిన్ పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ లేదా జనవరిలో ప్రారంభించి సమ్మర్ వరకు రెడీ చేయనున్నారట. పవర్ స్టార్ స్టెమినాకు తగ్గట్టు ఈ సినిమా కలెక్షన్లు సాధిస్తే మాత్రం నిర్మాతలు భారీగా లాభాలు రావడం ఖాయంగా కన్పిస్తోంది. పవర్ స్టార్ ప్రకటించిన మిగతా సినిమాలతో పోలిస్తే ఈ రీమేక్ చేసేందుకే ఆయన ఆసక్తి చూపుతున్నాడు.