https://oktelugu.com/

Nayanthara and Vignesh- TTD: విగ్నేష్-నయనతారలకు భారీ ఊరట… వివాదం నుండి బయటపడ్డ కొత్త జంట!

Nayanthara and Vignesh- TTD: నూతన దంపతులు నయనతార-విగ్నేష్ శివన్ లకు ఊరట లభించింది. వారిద్దరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలియజేసింది. మహాబలిపురంలో వివాహం జరిగిన మరుసటి రోజు నయనతార-విగ్నేష్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం నయనతార మాడవీధుల్లో చెప్పులు ధరించి తిరిగారు. అది పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో టీటీడీ నయనతార దంపతులపై చర్యలకు సిద్ధమైంది. కాగా నయనతార ఈ వివాదంపై స్పందించారు. పొరపాటున […]

Written By:
  • Shiva
  • , Updated On : June 12, 2022 / 01:25 PM IST
    Follow us on

    Nayanthara and Vignesh- TTD: నూతన దంపతులు నయనతార-విగ్నేష్ శివన్ లకు ఊరట లభించింది. వారిద్దరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలియజేసింది. మహాబలిపురంలో వివాహం జరిగిన మరుసటి రోజు నయనతార-విగ్నేష్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం నయనతార మాడవీధుల్లో చెప్పులు ధరించి తిరిగారు. అది పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో టీటీడీ నయనతార దంపతులపై చర్యలకు సిద్ధమైంది. కాగా నయనతార ఈ వివాదంపై స్పందించారు. పొరపాటున తప్పు జరిగిందంటూ బహిరంగ క్షమాపణలు చెప్పారు.

    Nayanthara and Vignesh

    ఈ క్రమంలో టీటీడీ వారి పై ఎటువంటి చర్యలు తీసుకోకూడని నిర్ణయం తీసుకుంది. నయనతార దంపతులు క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసింది. నయనతార-విగ్నేష్ లను కూడా సాధారణ భక్తులలాగే పరిగణిస్తామన్నారు. దీంతో కొత్త జంటకు పెద్ద ఊరట లభించింది.ప్రణాళిక ప్రకారం నయనతార-విగ్నేష్ శనివారం సుప్రభాత సేవలో పాల్గొనాల్సి ఉంది. వివాదం నేపథ్యంలో శుక్రవారమే ఇద్దరూ తిరుమల నుండి చెన్నై బయలుదేరారు.

    Also Read: Janasena Alliance: ‘పొత్తు’పై క్లారిటీ..: ఇక జనసేన దూకుడు..

    అసలు వివాదం ఏమిటని పరిశీలిస్తే.. జూన్ 9న మహాబలిపురంలో నయనతార-విగ్నేష్ శివన్ ల వివాహం జరిగింది. మరుసటి రోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని నయనతార దంపతులు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా జూన్ 10 శుక్రవారం సాయంత్రం తిరుమలను సందర్శించారు. దర్శనం అనంతరం తిరుమల మాడవీధుల్లో ఇద్దరు ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు బయటికి రావడంతో వివాదం రాజుకుంది. ఆలయ ప్రాంగణంలో నయనతార చెప్పులు వేసుకుని తిరిగినట్లు అధికారులు గుర్తించారు. అత్యంత పవిత్ర ప్రదేశంలో నయనతార చెప్పులతో సంచరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.

    Nayanthara and Vignesh

    నయనతారపై నెటిజెన్స్ విమర్శలు గుప్పించారు. ఆలయ పరిసరాల్లో చెప్పులతో తిరగకూడదని తెలియదా అంటూ ఆమెను ప్రశ్నించారు. భర్త విగ్నేష్ మాత్రం ఒట్టి కాళ్లతో ఉన్నారు. బ్రహ్మోత్సవాలు, స్వామి వారి ఊరేగింపులు జరిగే ప్రదేశంలో నయనతార చెప్పులతో తిరగడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో టీటీడీ అధికారులు నయనతార దంపతులపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇది వివాదం కాగా టీటీడీ నిర్ణయంతో వారికి ఉపశమనం లభించింది.

    Also Read:Jubleehiss Gang Rape: గుర్తుండిపోవాలని మెడపై కొరికాం..:బాలిక గ్యాంగ్ రేప్ కేసు

    Tags