పంతం నెగ్గించుకున్న పీకే: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూ

దేశంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. పార్టీ ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్నా చివరికి మేల్కొంది. చకచకా నిర్ణయాలు తీసుకుంటూ తన ప్రతిష్ట పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. నిద్ర మత్తును వీడి సంచలన నిర్ణయాలు వెలువరిస్తోంది. తెలంగాణలో పీసీసీ పీఠం రేవంత్ రెడ్డికి అప్పగించి పెద్ద సాహసమే చేసింది. ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాందీ ని బరిలోకి దింపాలని నిర్ణయించింది. పంజాబ్ లోనూ సంక్షోభానికి ముగింపు పలుకుతూ నవజ్యోతి సింగ్ సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా నియమించేందుకు తలపించింది. […]

Written By: Srinivas, Updated On : July 15, 2021 5:23 pm
Follow us on

దేశంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. పార్టీ ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్నా చివరికి మేల్కొంది. చకచకా నిర్ణయాలు తీసుకుంటూ తన ప్రతిష్ట పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. నిద్ర మత్తును వీడి సంచలన నిర్ణయాలు వెలువరిస్తోంది. తెలంగాణలో పీసీసీ పీఠం రేవంత్ రెడ్డికి అప్పగించి పెద్ద సాహసమే చేసింది. ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాందీ ని బరిలోకి దింపాలని నిర్ణయించింది. పంజాబ్ లోనూ సంక్షోభానికి ముగింపు పలుకుతూ నవజ్యోతి సింగ్ సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా నియమించేందుకు తలపించింది.

రెండేళ్లకు పైగా పంజాబ్ లో నలుగుతున్న సమస్యకు అధిష్టానం ముగింపు పలికింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, మాజీ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూ మధ్య గొడవను పరిష్కరించింది. దీంతో ఇన్నాళ్లుకొనసాగిన సస్పెన్స్ కు తెరపడినట్లయింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోతి సింగ్ సిద్దూ బాధ్యతలు చేపడతారని తెలిపింది. రెండు రోజుల్లో ఏఐసీసీ నుంచి ప్రకటన వెలువడుతుందని పంజాబ్ వ్యవహారాల ఇన్ చార్జి హరీశ్ రావత్ తెలిపారు.

పంజాబ్ కాంగ్రెస్ లో రెండేళ్లుగా నలుగుతున్న సీఎం అమరీందర్ సింగ్, సిద్దూల మధ్య గొడవలు జరుగుతున్నా పరిష్కార ఫార్ములాను వెలువరించడానికి అధిష్టానం చాలా సమయం తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, గతానికి భిన్నంగా ఈసారి బహుముఖ పోటీ నెలకొంది. బీజేపీతో విభేదించిన అకాలీదళ్ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆప్ సైతం పంజాబ్ ఓటర్లకు గాలం వేసేందుకు తాయిలాలు ప్రకటిస్తోంది. దీంతో కాంగ్రెస్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.

పంజాబ్ లో కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ పట్టు పట్టడం వల్లే అమరీందర్ సిద్దూ మధ్య సయోధ్య నెలకొందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ నేరుగా గాంధీత్రయం భేటీ అయి పంజాబ్ వ్యూహాలను ఖరారు చేసినట్లు సమాచారం. సిక్కు వర్గానికి చెందిన సిద్దూ అధ్యక్షుడు కాగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్దరికి చోటు లభించింది. అందులో ఒకరు దళిత నేత, మరొకరు హిందూ నేత ఉంటారు