Kerala Wayanad Landslide ; వయోనాడ్ లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. దీంతో చాలా మంది మరణించారు. దీంతో పాటు చాలా మంది తమ నివాసాలను కోల్పోయారు. ప్రకృతి సృష్టించిన బయోత్పాతానికి ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికీ కొందరు తమ ఇంటి శిథిలాల కింద బతికే ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కాపాడాలని కోరుతున్నారు. ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. గోడ కూలిన దుర్ఘటనలో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు, శిథిలాల కింద గల్లంతైన వారి జ్ఞాపకాలు కేరళ కొండచరియలు విరిగిపడిన ఫోటోలు ఆ ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేవారు. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన తర్వాత ముండక్కై గ్రామం, చురమల గ్రామాలు భయానకంగా మారిపోయాయి. భవనాలు కూలిపోయాయి. వీధులు పెద్ద పెద్ద రాళ్లు, బురదతో నిండి పోయాయి. పచ్చని కొండలు, వాటిపై తేయాకు తోటలు, అందమైన అడవులు ఉండేవి. మృత్యువు అదే కొండలపై నుంచి కిందకు వచ్చింది, ఇళ్లల్లో నిద్రిస్తున్న వారిని, హోటళ్లలో ఉన్న వారిని తీసుకెళ్లింది. చురల్మాల గ్రామం జలపాతాలకు ప్రసిద్ధి. సుచిప్పర జలపాతం, వెలోలిపారా జలపాతం, సీతా సరస్సు మొదలైనవి ఉండేవి. కానీ ఇప్పుడు అది శ్మాశానాలను తలపిస్తోంది. ప్రస్తుతం ముండక్కై, చురల్మాల పూర్తిగా కనుమరుగయ్యాయి. గతంలో కేదార్ నాథ్ ఘటన కళ్ల ముందు కనిపిస్తుంది. చాలా చోట్ల కార్లు, ఇతర వాహనాలు బురద, బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాయి.
తమ ఇరుగు పొరుగు, బంధువుల గురించి తెలుసుకునేందుకు శిథిలాల కింద వెతుకుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సహా పలు ఏజెన్సీలకు చెందిన సహాయక సిబ్బంది గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. బురద మధ్య ఫొటోలు కనిపించాయి. ఆ ముగ్గురి కుటుంబం ఉన్న ఇంట్లో ఎవరూ కనిపించకపోవడం దారుణం. ‘మేము సర్వం కోల్పోయాం, అందరినీ కోల్పోయాము’ అని ముండక్కై పెద్ద చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మాకు ఏమీ మిగలలేదు. నా కుటుంబం మొత్తం కనిపించడం లేదు. నేను వెతుకుతున్నాను. ఎక్కడా ఎవరూ కనిపించడం లేదు.’
ప్రస్తుతం మనం నడుస్తున్న భూమి కింద మన వారు సమాధి అయ్యారని చాలా మంది అంటున్నారు. మనవారు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలుసు. ముండక్కైలో ఏమీ మిగలలేదు. బురద, బండరాళ్లు తప్ప. వినాశనానికి ముందు ముండక్కైలో 450-500 ఇళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు 34 నుంచి 49 మాత్రమే మిగిలాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ముండక్కై, చురల్మాల, అట్టమల, నూల్పుజ గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వందలాది మంది మరణించారు.
ఇప్పటి వరకు 158 మంది మరణించారు. 186 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద వందలాది మంది కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. వయనాడ్ ఉత్తర కేరళలోని ఒక కొండ జిల్లా. ఇక్కడ అడవులు ఉన్నాయి. ఎత్తైన కొండలు, పీఠభూములు ఉన్నాయి. మెరిసే జలపాతాలు ఉన్నాయి. అరేబియా సముద్రంలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ఆకాశం మేఘామృతమైంది. రాబోయే వారం ఇంకా ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చిరిస్తోంది. మరో రెండు, మూడు రోజుల పాటు కేరళలోని లోతట్టు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
జూలై 30 నుంచి ఆగస్ట్ 2 వరకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందులో వయనాడ్ కూడా ఉంది. జూలై 30, 31 భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మొదటి 24 గంటల్లో 7 నుంచి 11 సెంటీ మీటర్లు, రెండో రోజు 12 నుంచి 20 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అంటే, ఇది విపరీతమైన పరిస్థితి. వచ్చే వారం పాటు వయనాడ్, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ వరకు వర్షపాతం విస్తరించనుంది. రెండో రోజు కూడా దాదాపు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల మధ్య కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గంటకు 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వీటివల్ల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరికలు జారీ చేశారు. కేరళ సమీపంలో ఆకాశం మేఘామృతమైంది. కొండలు ఈ మేఘాలు ముందుకు కదిలేందుకు దారి ఇవ్వకపోవచ్చు. దీంతో 2013లో కేదార్ నాథ్ లాంటి విషాదం ఇక్కడ చోటు చేసుకుంది.
అరేబియా సముద్రం దక్షిణ భాగంలోని ఉపరితలంపై దట్టమైన మేఘాలు ఏర్పడుతున్నాయి. ఈ మేఘాలు మెల్లమెల్లగా భూమి వైపునకు కదులుతున్నాయి. 2019లో జరిగినట్లే.. వాతావరణ మార్పుల కారణంగా అరేబియా సముద్రం నిరంతరం వేడెక్కుతోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం కేరళలోని 43% భూభాగం కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. ఇడుక్కిలో 74%, వయనాడ్ లో 51% భూ భాగం కొండలు వాలుగా ఉన్నాయి. అంటే విరిగిపడే అవకాశం ఎక్కువ అన్నమాట. 1,848 చ.కి.మీ వైశాల్యంతో పశ్చిమ కనుమలు కేరళలోనే అత్యధిక వాలును కలిగి ఉన్నాయి.